AP News: వెరైటీ వినాయకుడు .. కళ్ళు తెరుస్తూ.. మూస్తూ .. భక్తులను ఆశీర్వదిస్తూ..
అక్కడ వినాయకుడు కళ్లు తెరుస్తాడు. కళ్లు మూస్తుంటాడు. అవును మీరు విన్నది నిజమే. ఎక్కడ అనుకుంటున్నారా? మన కడప జిల్లాలో. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
ప్రతి ఏడాది వినాయక విగ్రహాల తయారీలో ఏదో ఒక కొత్తదనం కనబడుతూనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమకు నచ్చిన రీతిలో వినాయక ప్రతిమలను చేయించుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా ఎవరికీ వారు పెట్టే వినాయక విగ్రహం అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని ఆలోచిస్తారు. అలానే ఈసారి కూడా కడప నగరంలో ఓ వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది. వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ కళ్ళు తెరిచి మూసుకుంటూ అందరిని అలరిస్తుంది అక్కడి వినాయక విగ్రహం.
కడప నగరంలోని మాసాపేట సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం అందరిని అలరిస్తుంది. కనురెప్పలను మూస్తూ తెరుస్తూ వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఆ విగ్రహం భక్తులందరినీ ఆకట్టుకుంటుం.ది ఈ వినాయక విగ్రహం ఏర్పాటుపై నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినూత్న రీతిలో వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉంటామని అందులో భాగంగానే ఈ ఏడాది కూడా వినాయక విగ్రహాన్ని భక్తులందరికీ ప్రత్యేకంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో వినూత్న రీతిలో పెట్టినట్లు చెప్పారు. అన్ని వినాయక విగ్రహాల మాదిరిగానే ఇక్కడ విగ్రహం ఉన్నప్పటికీ ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. కనురెప్పలు మోస్తూ తెరుస్తూ ఉండడమే ఈ విగ్రహం లోని ప్రత్యేకత. అయితే విగ్రహం అలా కళ్లు మూయడానికి, తెరవడానికి లోపల రెండు కనురెప్పల వద్ద రెండు మోటార్లను ఏర్పాటు చేసి నిత్యం కరెంటుతో దానిని రన్ చేస్తూ కనురెప్పలు మూసుకొని… తెరుచుకునే లాగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హైదరాబాదులో ప్రత్యేకంగా తయారు చేపించినట్లు వారు తెలిపారు. ఏది ఏమైనా చాలా చక్కగా అందరిని అలరిస్తూ కనురెప్పలు మూస్తూ, తెరుస్తూ భక్తులను నిత్యం ఆశీర్వచనాలతో నింపే విధంగా కనిపిస్తున్న ఈ వినాయక విగ్రహాన్ని చూసేందుకు కడప నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
వీడియో దిగువన చూడండి….
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..