లేపాక్షికి ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపద గుర్తింపు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం.. త్వరలోనే ఆ హోదా వస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్‌..

ఏపీలో సాంస్కృతిక,  వారసత్వ సంపదకు కొదవ లేదు. రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు, చారిత్రక ప్రాంతాలున్నాయి. అయినా ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపు పొందిన 40 భారతీయ ప్రదేశాల్లో  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా గుర్తింపు పొందలేదు.

లేపాక్షికి ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపద గుర్తింపు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం.. త్వరలోనే ఆ హోదా వస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్‌..
Lepakshi Temple
Follow us

|

Updated on: Feb 05, 2022 | 8:07 AM

ఏపీలో సాంస్కృతిక,  వారసత్వ సంపదకు కొదవ లేదు. రాష్ట్రంలో ఎన్నో కట్టడాలు, చారిత్రక ప్రాంతాలున్నాయి. అయినా ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపు పొందిన 40 భారతీయ ప్రదేశాల్లో  ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా గుర్తింపు పొందలేదు. తాజాగా ఇదే విషయంపై రాజ్యసభలో తీవ్ర చర్చ జరిగింది. ప్రపంచ వారసత్వ ప్రదేశం (World Heritage Sites)గా గుర్తింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లోని ప్రదేశాల జాబితాలో కూడా.. ఏపీ నుంచి ఒక్క ప్రాంతం కూడా చేర్చలేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి జరిగిన ఈ ఘోరమైన అన్యాయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు ఎంపీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం.. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో కనీస చొరవ చూపలేదని వాపోయారు. ఇదే ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని విస్మరించడానికి కారణమని జీవీఎల్‌ చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను ఆశించిన ఫలితం దక్కతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వానికి జిన్నా వారసత్వంపైనే ఆసక్తి!

కాగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి సాంస్కృతిక వారసత్వ సంపద కంటే జిన్నా వారసత్వాన్ని కాపాడుకోవడం మీదే ఎక్కువ ఆసక్తి ఉందని జీవీఎల్‌ దుయ్యబట్టారు. ‘గుంటూరులోని జిన్నా టవర్‌ వ్యవహారంలో వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. వారు ఆంధ్రప్రదేశ్‌లో గర్వించదగ్గ సాంస్కృతిక వారసత్వం కంటే రాష్ట్రంలో జిన్నా వారసత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కాగ కేంద్ర ప్రభుత్వ ప్రషాద్ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు దేవస్థానాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు పథకంలో భాగంగా ఉన్నాయని బీజేపీ పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Also Read:Basara: బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం..

Vasantha Panchami 2022: ఈరోజు వసంత పంచమి.. శుభముహుర్తం.. ప్రాముఖ్యత.. ఆచారాల గురించి తెలుసుకోండి..

AP Crime News: చిన్న తొందరపాటు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. వాటర్ హీట్ చేస్తుండగా..