Andhra Pradesh: అనకాపల్లి అడ్డాగా ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. లక్షల్లో వసూళ్లు..

నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు దోచుకోవడం ఇటీవల పరిపాటైంది. అమాయకులైన యువకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు విభాగాల్లో కొలువుల ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన

Andhra Pradesh: అనకాపల్లి అడ్డాగా ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. లక్షల్లో వసూళ్లు..
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 11, 2022 | 2:54 PM

Andhra Pradesh: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు దోచుకోవడం ఇటీవల పరిపాటైంది. అమాయకులైన యువకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు విభాగాల్లో కొలువుల ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. 2018లో అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ని స్థాపించి.. 2021లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ప్రచారం చేశాడు. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు డిసైడ్ చేశాడు. దీంతో చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం వస్తుందనే ఆశతో బంగారం, ఆస్తులు అమ్మి సుధాకర్ కు లక్షల్లో చెల్లించామని బాధితులు వాపోతున్నారు. స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులను నమ్మించాడు సుధాకర్. డబ్బులు చెల్లించిన వారు ఉద్యోగాల కోసం స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే.. కొంతకాలం చెప్పడానికి పేరులేని చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యిస్తూ.. ముఖం చాటేశాడని బాధితులు వాపోతున్నారు.

చివరికి మోసపోయామని తెలుసుకున్న బాధితులు జిల్లాలోని నర్సీపట్నం, చోడవరం, ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లలో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇండిపూడి సుధాకర్ పై 420, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతో చేసిన మోసంలో ఎవరెవరు భాగస్వాములయ్యారనే దానిపై విచారణ చేస్తున్నామని, ఎంతమంది నుంచి ఎంత వసూలు చేశారనే పూర్తి వివరాలు విచారణలో తేలుతుందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు తమ నుంచి వసూలు చేసిన డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. తాము బంగారం, ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు తెచ్చామని దానిపై వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?