AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool District: ఆ ఊరికి ఉరుకులు పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. తీరా వెళ్లి చూడగా షాక్

కర్నూలు జిల్లాలో ఫీవర్ సర్వే తీవ్ర కలకలం రేపింది. ఒకరు చేసిన పొరపాటు అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది.

Kurnool District: ఆ ఊరికి ఉరుకులు పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. తీరా వెళ్లి చూడగా షాక్
Volunteer Mistake
Ram Naramaneni
|

Updated on: Dec 27, 2021 | 9:16 AM

Share

కర్నూలు జిల్లాలో ఫీవర్ సర్వే తీవ్ర కలకలం రేపింది. ఒకరు చేసిన పొరపాటు అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. గ్రామస్తులకు ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళ్తే..  కౌతాలం మండలం తోవి గ్రామంలో 80 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నాయంటూ యాప్ లో తప్పుగా అప్‌లోడ్‌ చేశారు వాలంటీర్. దీంతో ఆందోళనకు గురైన అధికారులు, వైద్య సిబ్బంది ఆ గ్రామానికి పరుగులు పెట్టారు. వాలంటీర్‌ను విచారించారు. ఐతే ఎవరికీ లక్షణాలు లేవని..పొరపాటున వివరాలు తప్పుగా నమోదయ్యాయని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ కేసులు కొన్ని దేశాల్లో భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం సాధారణ జలుబు లక్షణాలే ఒమిక్రాన్ వేరియంట్‌కు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సీన్ వేసుకున్న వారికి ఇతర వేరియంట్లు సోకినప్పుడు కనిపించే తేలికపాటి లక్షణాలే ఒమిక్రాన్ వేరియంట్ సోకినప్పుడూ కనిపిస్తున్నాయని వెల్లడిస్తున్నారు. తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, తుమ్ములు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు.

Also Read: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ఈ ఏడాది ట్రాఫిక్‌ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది..