Kurnool: ఇంటి పునాది కోసం తవ్వుతుండగా బయటపడిన లంకె బిందె.. ఓపెన్ చేయగా
Rayalaseema: రాయసీమలో లంకె బిందెలు బయటపడిన ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉంటాయి. పురాతన కాలంనాటి ఇళ్లను కూల్చివేసేటప్పుడు, కొత్త నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇలా వెండి, బంగారు, రాగి నాణేలు.. ఆభరణాలు బయటపడుతూ ఉంటాయి.
ఏదైనా నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు, పాత ఇళ్లు లేదా భవనాలను పడేస్తున్నప్పుడు.. పొలాన్ని దున్నుతున్నప్పుడు నిధి నిక్షేపాలు బయటపడిన ఘటనలు మనం చూస్తూ ఉంటాం. కూలీలకు ఈ నిధి కనిపిస్తే విషయం పక్కాగా పోలీసుల వద్దకు వెళ్తుంది. ఎందుకంటే పంపాకాల్లో తేడాలు వస్తాయి కాబట్టి. ఇంటి యజమానులకే పురాతన ఆభరణాలు లేదా నాణేలు దొరికాయి అనుకోండి.. వాటిని సైలెంట్‌గా దాచేస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ పురాతన నిధి దొరికిన ఘటన చర్చనీయాంశమైంది. శరణ బసప్ప అనే వ్యక్తి.. హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతడు తన పాత ఇంటికి కూల్చివేసి.. కొత్త ఇంటికి కట్టుకోవాలని భావించాడు.
కొంతమంది కూలీలను పెట్టి పాత ఇంటిని కూల్చేశాడు. కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా.. ఓ లంకె బిందె బయటపడింది. విషయం వెంటనే అధికారులు వద్దకు చేరింది. పోలీసులతో పాటు రెవిన్యూ అధికారులు అతడి ఇంటి ముందు వాలిపోయారు. ఆ బిందెను స్వాధీనం చేసుకుని.. ఓపెన్ చేయగా.. లోపల 1900 సంవత్సరంలో బ్రిటిష్ సర్కార్ ముద్రించిన సిల్వర్ కాయిన్స్, 1897 సంవత్సరానికి చెందిన రాగి నాణేలు ఉన్నట్లు గుర్తించారు.
కర్నూలు జిల్లాలో ఇలాంటి నిధి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. మొన్నామధ్య ఓ వ్యక్తి ఇంటిని కూలుస్తుండగా.. గోడ మధ్యలో ఓ భారీ ఇనుప బీరువా కనిపించింది. దానిలో భారీ ఎత్తున నిధులు ఉంటాయని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆ బీరువాపై లక్ష్మీదేవి బొమ్మ ఉంది. అధికారులు గ్యాస్ కట్టర్ సాయంతో దాన్ని ఓపెన్ చేయించగా.. లోపల ఏవో పత్రాలు మాత్రమే ఉండటంతో అందరూ ఉసూరుమన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం