Somireddy : కృష్ణాజలాల గెజిట్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకునేవరకూ టీడీపీ దశలవారీ పోరాటం : సోమిరెడ్డి
కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తెస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది...
Somireddy – Krishna Waters – Center’s Gazette Notification : కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తెస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై పోరాడేందుకు దశలవారీగా ఉద్యమం చేస్తామని ఆపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కర్నూలులో టీవీ9తో మాట్లాడుతూ హెచ్చరించారు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి నెట్టివేయడం వల్ల సీమ ప్రాజెక్టులు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు.
కేంద్రం వెనక్కి తగ్గే వరకూ ఆరు జిల్లాల ప్రజలు ఏకమవుతామని.. తాడో పేడో తేల్చుకుంటామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ‘సీఎం జగన్.. కాంట్రాక్టర్ల కోసం, అడ్వాన్సుల కోసం ప్రాజెక్టులు చేయకండి.. రైతుల కోసం ప్రాజెక్టులు చేయండి..’ అని సోమిరెడ్డి సూచించారు.
ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలే సమస్యలు తెచ్చి పెడుతున్నాయని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిలిపేసి ఏదో ఘనకార్యం చేసినట్టు సీఎం చెబుతున్నారని విమర్శించారు. కేఆర్‌ఎంబీ టీమ్‌ని అనుమతించాలని, ఏ నివేదిక ఇస్తుందో చూద్దామని సోమిరెడ్డి అన్నారు.
జల వివాదంపై సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడాలని సోమిరెడ్డి సూచించారు. తెలంగాణలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పోరాడాలన్న సోమిరెడ్డి.. శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80 వేల కుటుంబాలు నిర్వాసితులయ్యాయన్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలు వస్తే కృష్ణా జలాలను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నిఖర జలాలుగా ఇవ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
Read also : Road accident : నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి