Allagadda: స్కార్పియోకి టూవీలర్‌ నెంబర్‌ ప్లేట్‌, ఊరంతా కలియ తిరుగుతూ రెక్కీ.. ఆళ్లగడ్డను హడలెత్తిస్తోన్న కారు

కారు వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు. అయితే, ఆ స్కార్పియోకి టూవీలర్‌ నెంబర్‌ ప్లేట్‌. డ్రైవర్‌ సీట్లో ఎవరో అస్సలు తెలీని వ్యక్తి.

Allagadda: స్కార్పియోకి టూవీలర్‌ నెంబర్‌ ప్లేట్‌, ఊరంతా కలియ తిరుగుతూ రెక్కీ.. ఆళ్లగడ్డను హడలెత్తిస్తోన్న కారు
Allagadda Tension
Follow us

|

Updated on: Jul 14, 2021 | 1:28 PM

Scorpio moving: కారు వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు. అయితే, ఆ స్కార్పియోకి టూవీలర్‌ నెంబర్‌ ప్లేట్‌. డ్రైవర్‌ సీట్లో ఎవరో అస్సలు తెలీని వ్యక్తి. ఇప్పుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ కారు దడ పుట్టిస్తోంది. ఇంతకీ కార్లో ఉన్న దుండగుడెవరు? పెద్దిరెడ్డి పేరును వాడుకుంటే ఎవరికీ దొరకమని.. ఇలా తిరుగుతున్నారా? ఎవరికైనా హాని తలపెట్టాలని రెక్కీ నిర్వహించారా? ఇవే సందేహాలు ఇప్పుడు స్థానికుల్లో అలజడిని రేపుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా శిరివెల్ల మండలం గోవిందలపల్లిలో స్కార్పియోలో దుండగులు రెక్కి నిర్వహించారు. స్పార్పియో వాహనంలో అనుమానాస్పదంగా వ్యక్తులు ఊళ్లోకి వచ్చారు. ఊరంతా తిరిగారు. ఎవరికోసమో తిరుగుతున్నారు? ఎందుకోసమో తిరుగుతున్నారు? స్పార్పియోతో గ్రామంలో చక్కర్లు కొడుతున్న వ్యక్తులు అసలెవరు.. ఈ వాహనాం ఎవరిది..? ఎక్కడినుండి వచ్చింది అనే సందేహాలు గ్రామస్థులను టెన్షన్ పెడుతున్నాయి.

స్కార్పియో వాహనానికి టూవీలర్ నెంబర్‌ పెట్టుకుని మరీ తిరుగుతున్నారు. బండి మీద పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే పేరు ఉండటం.. స్థానికుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ వాహనాన్ని చూసిన పలువురు వెంబడించారు. దీంతో వాహనాన్ని వదిలి అడవిలోకి పారిపోయారు దుండగులు. ఓ కేసులో ప్రధాన నిందితుడిని హత్యమార్చేందుకు రెక్కి నిర్వహిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

మిస్టరీలో మరో మలుపు:

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన టిడిపి నేత రౌడీ షీటర్ రవి చంద్రా రెడ్డి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ప్రధాన అనుచరుడు. రవిచంద్రారెడ్డి పై పీడీ యాక్ట్ తోపాటు అనేక కేసులు ఉన్నాయి. టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో కూడా నిందితుడు. గోవిందపల్లి లోని ఇతని ఇంటి దగ్గరికి స్కార్పియో వచ్చింది. ఇంటి దగ్గరకు రాగానే రవిచంద్రారెడ్డి భార్య బయటకు వచ్చి చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన పోలీసులు ను చూసి స్కార్పియో లో ఉన్నవారు అదే వాహనంలో లో పారిపోయారు పోలీసులు వెల్లడించారు. రుద్రవరం దగ్గర ఓ మహిళను ఢీకొట్టడంతో ఆ గ్రామస్తులు కూడా స్కార్పియో ని వెంబడించారు. చివరకు దారిలేక పొలంలో వదిలేసి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయారు.

వీళ్లు రవి చంద్ర రెడ్డి ని హత్య చేసేందుకు వచ్చారా లేక ఆయనతో ఏమైనా డీల్ కుదుర్చుకునేందుకు వచ్చారా అనే దానిపై రకరకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేక్ నెంబర్ తో రావడంతో కచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్కార్పియో పై ఉన్న నెంబర్ హైదరాబాద్లోని సైఫాబాద్ కు చెందిన రాజేంద్రప్రసాద్ కు చెందిన హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ వాహనం గా రికార్డులలో చూపిస్తోంది. తన హత్యకు కుట్రపన్నిన కేసులో రవిచంద్రారెడ్డి ఉన్నందున పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, చాలా అనుమానాలు ఉన్నాయని ఏ వి సుబ్బారెడ్డి అంటున్నారు.

రవిచంద్ర రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చినందున అతని హత్యకు కుట్ర పన్ని ఉండొచ్చని ఉద్దేశంతో ఏవీ సుబ్బారెడ్డి అనుచరులను పోలీసులు పిలిపించి విచారించారు. తర్వాత వదిలిపెట్టారు. గతంలో కేసులో రవిచంద్రారెడ్డి పై ఉన్న విషయం వాస్తవమేనని ఇటీవల కాలంలో రవిచంద్రారెడ్డి ఇలాంటి గొడవలు లేకుండా సొంత పనులు చేసుకుంటున్నాడు అని అలాంటి పరిస్థితులలో రవిచంద్రారెడ్డి హత్య చేసేందుకు వచ్చి ఉంటారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుమానించారు. దీని వెనుక ఏదో కుట్ర ఉన్నందున త్వరగా తెలిసి నిజానిజాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటివరకు వాహనం ఎవరిది..? ఇది అందులో ఎవరు ఉన్నారు.? అనే విషయాలు పూర్తిగా తెలియలేదని ఇంజిన్, చాసిస్ నెంబర్ల ఆధారంగా విచారిస్తామని అంటున్నారు.

Read also: Borra Caves: బొర్రాగుహల ప్రాంతంలో స్టోన్‌ మాఫియా, రంగురాళ్లకోసం యధేచ్చగా తవ్వకాలు, పొంచి ఉన్న ముప్పు.!