AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: రైస్ మిల్లులో కదులుతూ కనిపించిన వడ్ల బస్తా.. కోసి చూడగా…

కర్నూలు జిల్లాలోని చిన్న కంబళూరులో రైస్ మిల్లో పనిచేస్తున్నవారు వడ్ల బస్తా కదులుతుండటంతో కోసి చూడగా.. లోపల నుంచి ఓ పాము బయటకు వచ్చి ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. అయితే అది విషపూరితం కాని రెడ్ సాండ్ బోవాగా గుర్తించారు... ..

Kurnool: రైస్ మిల్లులో కదులుతూ కనిపించిన వడ్ల బస్తా.. కోసి చూడగా...
Red Sand Boa
Ram Naramaneni
|

Updated on: Nov 18, 2025 | 10:25 AM

Share

అది కర్నూలు జిల్లాలోని ఓ రూరల్ ప్రాంతం. ఊరి పేరు చిన్న కంబళూరు. అక్కడ నరేష్ అనే వ్యక్తికి రైస్ మిల్లు ఉంది. రోజూ కొందరు అక్కడ పని చేసేందుకు వస్తారు. అయితే ఇటీవల వారు పని చేస్తుండగా.. ఓ వడ్ల బస్తా కదులుతూ కనిపించింది. దీంతో లోపలకు ఎలుక లేదా పందికొక్కు దూరిందేమోనని భావించి.. బస్తాను కోసారు. అయితే లోపల నుంచి ఓ పాము బయటకు వచ్చింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే అది విషపూరితమైన పాము కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

View this post on Instagram

A post shared by మన ఆళ్ళగడ్డ (@mana_allagadda_)

కాగా ఈ పామును స్థానికంగా రెండు తలల పాము అంటారు కానీ… దాని శాస్త్రీయ నామం రెడ్ సాండ్ బోవా. ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పూర్తిగా విషరహితం, చాలా నెమ్మదిగా కదులుతుంది, మనుషులపై దాడి చేయదు. వాస్తవానికి దీనికి ఒక తలే ఉంటుంది. రెండో వైపున శరీర నిర్మాణం ముడుచుకుని ఉండటం వల్ల తల ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ పాము పాము లింగం మార్చుకుంటుందని, అదృష్టం తెస్తుందని, పాము వల్ల కోట్లు వస్తాయని, ఇది ఇంట్లో ఉంటే జీవితం మారిపోతుందని బ్లఫ్ చేస్తూ ఉంటారు. అస్సలు నమ్మకండి. భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ చట్టం (WPA, 1972) ప్రకారం ఈ పాము రక్షించాల్సిన జాతిలో ఉంది. దీన్ని.. కొనడం, అమ్మడం, పట్టుకోవడం, పెంపుడు జంతువుగా పెట్టుకోవడం నేరం. అలా చేస్తే.. 7 సంవత్సరాల జైలు పడుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us