AP News: పొలంలో రైతుకు మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని చూడగా..

రాయలసీమ... నేడు కరువు సీమగా మారిందిగానీ.. ఒకప్పుడు రతనాల సీమగా ఉండేది. వజ్రాల్ని రాసులు పోసి అమ్మేవారు. ఇప్పటికీ సీమ గర్భంలో ఎంతో సంపద దాగి ఉంది. తొలకరి వానలు పడ్డాయంటే చాలు వజ్రాల వేట కొనసాగుతుంది. జల్లులు పడగానే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలుగ్రామాల్లో సందడిగా ఉంటుంది. ఇక్కడి పొలాల్లో వజ్రాలను పోలిన రాళ్లు ఉంటాయి. ఆ రాళ్లలో కూడా నిజమైన వజ్రాలు దొరుకుతాయి.

AP News: పొలంలో రైతుకు మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని చూడగా..
Diamond (Representative image)
Follow us

|

Updated on: May 25, 2024 | 1:50 PM

వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వజ్రాల కోసం అన్వేషణ సాగుతోంది. ఏటా తొలకరి వానలు ప్రారంభమయ్యాక వజ్రాల కోసం వెతికేవారు. ఈసారి మాత్రం ముందుగానే వేసవిలో అకాల వర్షాలు పడుతుండటంతో వారం క్రితం నుంచే వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ రైతును లక్కు కలిసొచ్చింది. పొలం పనులు చేస్తుండగా దూరం నుంచి ఏదో మెరుస్తూ కనిపించింది. వెళ్లి చూడగా.. అది డైమండ్.. దీంతో అతని.. సుడి తిరిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుండగా..  పొలంలో ఓ వజ్రం దొరకిందట.. పెరవలికి చెందిన వ్యాపారి వేలం పాటలో రూ.5 లక్షలు, రెండు గ్రాముల బంగారం రైతుకు ఇచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. అయితే బయట మార్కెట్‌లో ఆ వజ్రం విలువ చాలా ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.

రాయలసీమలోని.. తుగ్గలి, జొన్నగిరి, రామగిరి పగిడిరాయి ప్రాంతాల్లో వారం రోజులుగా వజ్రాల అన్వేషణలో బిజీ అయ్యారు. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా అని వజ్రాల కోసం గాలిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒకటి రెండేళ్లు కాదు.. ఎన్నో ఏళ్లుగా.. ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. అనంతపురం-కర్నూలు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో… ఏటా ఈ వేట సాగుతుంది. ఒక్కసారి.. ఒక వజ్రం దొరికిందంటే లక్షాదికారి కావొచ్చన్న ఆశతో.. ఎంతోమంది వాటికోసం వెతుకుతున్నారు.  మరోవైపు దొరికిన వజ్రాలను కొనేందుకు వ్యాపారులు సైతం సమీప ప్రాంతాల్లో తిష్ట వేశారు.

దొరికిన వజ్రాలను కొందరు గుట్టుగా అమ్ముకుంటారట. మరికొందరు ధర నచ్చక పోతే టెండరు పద్ధతిలో అమ్ముతారని ప్రచారం. తుగ్గలి మండల జొన్నగిరి, మద్దికెర మండలం పెరవలి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారులు ఈ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని కూడా టాక్ నడుస్తోంది. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను నియమించుకుంటారు. వజ్రాలను కొనుగోలు చేసి ముంబయి, చెన్నై, బెంగళూరులో అమ్ముతారని చర్చనడుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…