AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆ గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఎందుకో తెల్సా.?

కొంతమంది మాత్రమే తమ ఇంటి పేరు ఓ బ్రాండ్‌గా మారేలా ఎదిగుతారు. అలాంటి ఇంటి పేరే కొనిదెల. ఈ పేరు వినగానే అర్థం అవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ ఇంటి పేరని. కొనిదెల ఇంటి పేరుకు బ్రాండ్‌గా గుర్తుపెట్టుకునేలా చేసిన ఘనత చిరంజీవి, పవన్ కళ్యాణ్ ది.

Andhra: ఆ గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఎందుకో తెల్సా.?
Andhra News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 04, 2025 | 12:32 PM

Share

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే చిన్న గ్రామం ఉంది. 2019 ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌ను తన ఇంటి పేరు గల కొణిదెల గ్రామం బాగా ఆకర్షించింది. కొణిదెల గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. గ్రామ సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుని ఎన్నికలలో విజయం సాధిస్తే కొనిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించిన తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు పవన్. అనూహ్యంగా ఆ గ్రామానికి వ‌రం ఇచ్చారు.

క‌ర్నూలు-పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప‌వ‌న్.. కొణిదెల గ్రామం గురించి ప్రస్తావిస్తూ.. నందికొట్కూరు ఎమ్మెల్యే కొణిదెల గ్రామం గురించి చెప్పార‌ని తెలిపారు. ఆ గ్రామ అభివృద్ధి గురించి కోర‌గా, ద‌త్తత తీసుకుని ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి కేటాయిస్తున్నానని ప్రక‌టించారు. అలాగే అధికారులతో మాట్లాడి గ్రామానికి పథకాలు వచ్చేలా చేస్తానన్నారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో మాట్లాడి ఆ గ్రామానికి కావాల్సిన పనులు అన్ని చేసి పెడతాను. పనులు చేసి తర్వాత కొణిదెల గ్రామానికి వస్తానని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డంతో ప్రజ‌ల్లో హ‌ర్షాతిరేకాలు వ్యక్తమ‌య్యాయి. దీంతో కొణిదెల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్‌కు కొణిదెల గ్రామం గురించి గుర్తు చేసినందుకు గాను, 50 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి వచ్చేలా కృషి చేసినందుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సత్కరించి తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

తన ఇంటి పేరు ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకోవడం గ్రామ అభివృద్ధికి మాట ఇవ్వడంతో ఫ్యాన్స్, జనసైనికులు పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నారు. ఇప్పుడు కొనిదెల బ్రాండ్ రాయల‌సీమ లోనూ, రాష్ట్రంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి కొనిదెల గ్రామానికి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదు. నందికొట్కూరు నియోజకవర్గంలో కొణిదెల అనే గ్రామం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా చైతన్యవంతమైన గ్రామం. అన్ని పార్టీలకు చెందిన ఇక్కడి కుటుంబాలు, నేతలు దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా రాణిస్తూ ప్రజాసేవలో తరిస్తున్నారు. కాకపోతే గ్రామం పేరు.. పవన్ కళ్యాణ్ ఇంటి పేరు ఒకటే కావడంతో కొంత ప్రాధాన్యత పెరిగింది. అంతకుమించి వేరే ప్రత్యేకత లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..