AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆయ్ ‘రామలు’ సీజన్ వచ్చేసిందండీ.. టేస్ట్‌లో పులసతో పోటీ..

అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మొదటి వారంలోపు మాత్రమే రామలు లభిస్తాయి. సాధారణంగా చేపలలో ఉండే చేదు కట్టును తీశాక వంట చేస్తారు. కానీ ఆరోగ్య ప్రయోజనాల దృశ్య.. రామలను చేదు కట్టుతోనే కూర వండుతారు.

AP News: ఆయ్ 'రామలు' సీజన్ వచ్చేసిందండీ.. టేస్ట్‌లో పులసతో పోటీ..
Ramalu Fish
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2024 | 2:59 PM

Share

పులస చేప తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరికి వరదనీరు వచ్చినప్పుడు జాలర్లకు చిక్కే ఈ చేపలు.. వారి దండిగా కాసులను అందిస్తాయి. జులై నుంచి అక్టోబర్‌ వరకు పులసలు చిక్కుతూ ఉంటాయి. రుచితో పాటు ఎన్నో పోషక విలువలు ఈ చేప సొంతంపల్లెటూర్లలో ఎవరైనా పులస.. కొని వండుకున్నారంటే..  ఊరంతా ఆ విషయాన్ని ఆ రోజు గొప్పగా చెబుతుంటారు. అది పులస రేంజ్. ఇక పులస మాదిరిగానే.. గోదావరి జిల్లాల్లో  ‘రామ చేప’ కూడా చాలా పాపులర్. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. రామ చేపలు చూడటానికి బొమ్మిడాయిలు మాదిరిగానే ఉంటాయి. టేస్ట్ అయితే పులసల లాగానే ఉంటుందట. ఈ చేపలు 5 నుంచి 7 అంగుళాలు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ చేపల లభ్యత ఉంటుంది.

Also Read: ఆ కాపరికి చెందిన నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా.. నిర్మానుష్య ప్రదేశంలో

రామల చేపలు..  కిలోకు 40 వరకు తూగుతాయి. కానీ వీటిని పీస్‌ల లెక్క అమ్ముతూ ఉంటారు. సాధారణంగా రామలు ధర ఒక్కోటి రూ.25 వరకు ఉంటుంది. కానీ ప్రారంభ సీజన్‌లో ఒక్కోటి రూ.30కు పైనే పలుకుతుంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రూ.40 నుంచి రూ.50 పలుకుతుంది. ఈ చేపలను మన దగ్గర తినడమే కాకుండా..  కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తారు. మసాలా దట్టించి ఇగురు పెట్టినా.. ఇదే సీజన్‌లో కాసే లేత చింతకాయలతో కలిపి పులుసు పెట్టినా.. ఆ రుచి అమోఘం అంటున్నారు మాంసాహార ప్రియులు. చింతకాయలతో కలిపి వీటిని కూర వండితే ఆ వాసన ఊరి పొలిమేర దాటాల్సిందేనట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..