NTR District: ఆ కాపరికి చెందిన నాలుగు గొర్రెలు మిస్సింగ్.. వాటి కోసం వెతుకుతుండగా.. నిర్మానుష్య ప్రదేశంలో
నందిగామ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమెట్ల గ్రామానికి సమీప ప్రాంతాల్లో ఎన్నో దశాబ్దాలుగా వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. సంవత్సరం పొడవునా సాగే వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ ఈ సారి వాటి కోసం ఏకంగా క్షుద్రపూజల వరకు వెళ్లడం కలకలం రేపుతోంది.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట దగ్గర క్షుద్రపూజల కలకలం చెలరేగింది. మేకను బలిచ్చి పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. తమ వ్యాపారం పెరగాలంటూ పేపర్‌పై రాసి పూజలు చేయడం చర్చనీయాంశమైంది. కొన్నేళ్లుగా గుడిమెట్లలో వజ్రాల కోసం వెదుకులాట కొనసాగుతుంది. తాజాగా ఇలా క్షుద్ర పూజలు చేసి మరీ.. వజ్రాల కోసం వేటాడుతుండటంతో స్థానికులు భయపడుతున్నారు.
తన 3 మేకలు మూడు రోజులుగా కనిపించడం లేదంటూ నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి కోసం వెదుకుతుండగా తన మేకలనే బలిచ్చినట్లుగా ఆనవాళ్లు కనిపించాయని అంటున్నాడు నాగరాజు. నాగరాజు ఫిర్యాదుపై క్షుద్రపూజలు జరిగిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

