AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: చెరువు కబ్జా అంటూ నోటీసులు.. స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్‌ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బంధువులకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.

AP News: చెరువు కబ్జా అంటూ నోటీసులు.. స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
Kethireddy Venkatarami Reddy
Ram Naramaneni
|

Updated on: Nov 08, 2024 | 1:53 PM

Share

— సత్యసాయి జిల్లా ధర్మవరం వడియార్ చెరువు విస్తీర్ణంపై వివాదం రాజుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్యకు జలవనరుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నోటీసులిచ్చారు. ఏడు రోజుల్లో చెరువు భూమిని ఖాళీ చేయాలని అధికారులు నోటీసుల్లో సూచించారు.

— ఈ నోటీసులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 904, 905, 908, 909 సర్వే నెంబర్లలో తన సోదరుడి భూములు ఉన్నాయని అంటున్నారు కేతిరెడ్డి. సర్వే నెంబర్ 661‌లో మాత్రమే ఇరిగేషన్ శాఖ భూమి ఉంది. తన సోదరుడి భూములు చెరువులోకి రావని స్పష్టం చేశారు.

ఈ నోటీసులపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించానని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు సైతం చెప్పిందని గుర్తు చేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై లీగల్‌గా ముందుకు వెళ్తానని అంటున్నారు. అన్ని ఆధారాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని అంటున్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే