Kesineni Nani: వైసీపీలో చేరిన తర్వాత స్పీడ్ పెంచిన కేశినేని నాని.. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నోటిఫికేషన్ రాకముందు.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అటు.. రా.. కదలి రా.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు.. జనంతోకి వెళ్తుంటే.. సిద్ధం అంటూ విశాఖ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నోటిఫికేషన్ రాకముందు.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అటు.. రా.. కదలి రా.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు.. జనంతోకి వెళ్తుంటే.. సిద్ధం అంటూ విశాఖ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ క్రమంలోనే.. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు- ప్రతివిమర్శలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు సెగలు రేపుతున్నాయి. ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. చంద్రబాబు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. చంద్రబాబుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు కేశినేని నాని. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుకు దమ్ముంటే విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.
మరోవైపు.. కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసమే చంద్రబాబు తాపత్రాయమని ఆరోపించారు కేశినేని నాని. టిక్కెట్లు అమ్ముకుని మూటాముల్లె సర్దుకుని చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలన్నారు కేశినేని నాని. తిరువూరు ఘటనతో ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు మారిపోయాయని చెప్పారు.
ఈ రోజు తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం @ysrcongress పార్టీ ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి గారు మరియు వైస్సార్సీపీ తిరువూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు గారితో కలసి పాల్గొన్నాను . pic.twitter.com/iCzHSVFMYW
— Kesineni Nani (@kesineni_nani) January 28, 2024
మొత్తంగా.. వైసీపీలో చేరిన తర్వాత కేశినేని నాని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా.. చంద్రబాబును వదిలిపెట్టేదే లే అన్నట్లుగా ఆయనపై విరుచుకుపడుతున్నారు. అయితే.. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కేశినేని సవాల్ విసిరిన నేపథ్యంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
