Andhra Pradesh: గౌరీ దేవికి సారె సమర్పించిన మహిళలు.. 100 రకాల స్వీట్స్ పండ్లు , పూలతో ఊరేగింపు

| Edited By: Surya Kala

Nov 19, 2024 | 3:38 PM

కార్తీక మాసం పర్వదినాల్లో గౌరీ దేవికి సారె సమర్పిస్తారు గవర కులస్తులు. ఏ గ్రామంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా గౌరీ, శంకరులకు ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసం నెల రోజులూ గౌరీ శంకరులకు విగ్రహ రూపంలో ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి సహపంక్తి భోజనాలు, సంకీర్తనలు చేస్తారు.

Andhra Pradesh: గౌరీ దేవికి సారె సమర్పించిన మహిళలు.. 100 రకాల స్వీట్స్ పండ్లు , పూలతో ఊరేగింపు
Saree For Goddess Gouridevi
Follow us on

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో గవర కులస్తులు కార్తీకమాస సారెను శ్రీ గౌరీ మాతకు సమర్పించారు. మన గవర కులస్తుల కార్తీకమాస మహోత్సవం పేరిట ఆత్మీయ సమావేశం జరిగింది. కార్తీక మాసం పర్వదినాల్లో గవరల కులదేవత అయిన గౌరీ దేవికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీగా ప్రకారం తోలేరు కనకదుర్గమ్మ ఆలయం నుంచి వీరవాసరం తులసి కళ్యాణమండపం వరకూ శ్రీ గౌరీదేవి సమర్పించే సారెతో నాలుగు వేల మంది మహిళలు ఊరేగింపును నిర్వహించారు.

పసుపు , కుంకుమ, లడ్డూ , కాజా , మైసూర్ పాక్, బాదుషా, కోవా, లాంటి వంద రకాల స్వీట్స్, అరటి, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు, చామంతి, బంతి, గులాబి వంటి వివిధ రకాల పూలతో సారె ను తీసుకుని వచ్చి గౌరీ దేవికి సమర్పించారు. మంగళ వాయిద్యాలతో వైభవంగా సారెను తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు చేసి గౌరీ శంకరులకు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, గవర కార్పోరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, బుద్దా వెంకన్న ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సంస్కృతి సంప్రదాయాలు తరువాతి తరం వారికి తెలియడం కోసం గౌరీ దేవికి సారె సమర్పించడం, వన మహోత్సవం నిర్వహించడం జరిగిందని గవర సంఘం జిల్లా అధ్యక్షుడు మళ్ళ తులసీరాం ( రాంబాబు ) అన్నారు. హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం కాపాడడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాంబాబు అన్నారు. రాబోయే తరాలకు పూర్వికుల ఎటువంటి విధానాలు అవలంబించారు, ఏవిధంగా కుల దేవతలను కొలిచారు అనే విషయాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలోని గవర కులస్తులు, ఇతర జిల్లాలోని ప్రముఖులు పాల్గొన్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..