AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuni Accident: యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన గ్యాస్ సిలిండర్స్ లారీ.. బిక్కు బిక్కుమంటున్న గడిపిన జనం

కాకినాడ జిల్లా అన్నవరం శివారు ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. తుని మండలం తేటగుంట వద్ద జాతీయ రహదారిపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం తరలిస్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం వెళ్తున్న హైడ్రోక్లోరిక్ ట్యాంకర్‌ను వెనక నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఇటు అన్నవరం వైపు అటు తుని వైపు ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది.

Tuni Accident: యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన గ్యాస్ సిలిండర్స్ లారీ.. బిక్కు బిక్కుమంటున్న గడిపిన జనం
Tanker Accident
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: May 28, 2024 | 7:56 AM

Share

కాకినాడ జిల్లా అన్నవరం శివారు ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. తుని మండలం తేటగుంట వద్ద జాతీయ రహదారిపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం తరలిస్తున్న ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం వెళ్తున్న హైడ్రోక్లోరిక్ ట్యాంకర్‌ను వెనక నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఇటు అన్నవరం వైపు అటు తుని వైపు ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గురైన హైడ్రో క్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ నుంచి దట్టమైన పొగతో పాటు తెల్లటి లావణంతో కూడుకున్న యాసిడ్ లీక్ అవడంతో ఘటనాస్థలంలో దట్టమైన పొగలా ఉండడంతో పాటు తీవ్ర దుర్వాసన కూడా వెలువడింది. దీంతో స్థానిక వాహనదారులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కళ్ల మంటలు వస్తుండడంతో స్థానికులు ఆస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా తేటగుంట దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చేందుకు సర్వశక్తుల ప్రయత్నించారు. ట్రాఫిక్ ని మళ్ళించి వాహనాలను పునరుద్దరించారు. అయితే దుర్వాసన గ్యాస్ వెలబడకుండా అగ్నిమాపక వాహనాలు రప్పించి గ్యాస్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..