AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. పెంపుడు కుక్క మృతి.. అసలు దానికి ఏమైందంటే?

Kakinada missing child case Update: కాకినాడ చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. చిన్నారి ఆచూకీ కనుక్కునేందుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి బయటకు వదిలిని పెంపుడు కుక్క శనివారం అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో కేసుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Kakinada: కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. పెంపుడు కుక్క మృతి.. అసలు దానికి ఏమైందంటే?
Kakinada Missing Child Case
Anand T
|

Updated on: Jun 13, 2026 | 3:58 PM

Share

కాకినాడ జిల్లాలోని తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి ఆచూకీ కనిపెట్టడంలో అత్యంత కీలకంగా భావించిన పెంపుడు కుక్క హఠాత్తుగా మరణించింది. బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు ఇటీవల అధికారులు ఆ కుక్కకు జీపీఎస్ (GPS) ట్రాకర్ అమర్చి బయటకు వదిలారు. ఈ క్రమంలో అది అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే..?

గత వారం రోజుల క్రితం మూడేళ్ల చిన్నారి జాహ్నవి తన పెంపుడు కుక్కతో కలిసి ఇంటి బయట ఆడుకునేందుకు వెళ్ళింది. అయితే, ఆ తర్వాత ఆ చిన్నారి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. బాలిక అదృశ్యమైన మూడు రోజుల తర్వాత పెంపుడు కుక్క మాత్రం అనూహ్యంగా తిరిగి ఇంటికి వచ్చింది. కానీ, మూడేళ్ల జాహ్నవి ఆచూకీ మాత్రం లభించలేదు. చిన్నారిని కనిపెట్టేందుకు సుమారు 200 మంది పోలీసు సిబ్బంది, స్నిఫర్ డాగ్స్ రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

మరిన్ని అనుమానాలు..

చిన్నారితో పాటు వెళ్లి, మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన పెంపుడు కుక్కే ఈ కేసుకు కీలకమని పోలీసులు భావించారు. దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి, బాలిక జాడ కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఆ కుక్కను బయటకు వదిలిన మరుసటి రోజే (శనివారం) అది ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. ట్రాకర్ అమర్చిన వెంటనే కుక్క చనిపోవడం వెనుక ఎవరిదైనా కుట్ర ఉందా? బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా? చిన్నారి కుటుంబానికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us