AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrogen Train: పొగరాదు.. కార్బన్ ఉండదు.. కేవలం నీటి ఆవిరితో పరిగెత్తే ‘భారత తొలి హైడ్రోజన్ రైలు’ విశేషాలివే!

Hydrogen Train: భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు. ఇది దేశంలో స్వదేశీ హైడ్రోజన్ రైలు రవాణా వ్యవస్థకు గట్టి పునాది వేసింది. పర్యావరణ హితమైన, జీరో-ఎమిషన్ (సున్నా ఉద్గారాలు) రవాణా పట్ల భారత్ ఉన్న..

Hydrogen Train: పొగరాదు.. కార్బన్ ఉండదు.. కేవలం నీటి ఆవిరితో పరిగెత్తే 'భారత తొలి హైడ్రోజన్ రైలు' విశేషాలివే!
Hydrogen Train
Subhash Goud
|

Updated on: Jul 25, 2026 | 4:28 PM

Share

Hydrogen Train: భారతీయ రైల్వే రవాణా రంగంలో ఒక నూతన విప్లవానికి తెరలేచింది. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే డీజిల్ పొగకు స్వస్తి పలుకుతూ, అత్యంత స్వచ్ఛమైన ఇంధనంతో నడిచే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును భారత్ అందుబాటులోకి తెస్తోంది కేంద్రం.

ఇది ఎలా పనిచేస్తుంది?

హైడ్రోజన్ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య జరిగే రసాయన చర్య ద్వారా స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియలో రైలు నడవడానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తవుతూ, బై-ప్రొడక్ట్‌గా కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. ఎటువంటి పొగ గానీ, కార్బన్ ఉద్గారాలు గానీ విడుదల కావు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే సాంకేతికతల్లో ఇది అత్యంత అద్భుతమైనది.

ఇది కూడా చదవండి: ITR Filing: మిత్రమా..! జూలై 31 సమీపిస్తోంది.. గడువు దాటితే రూ.5000 ఫైన్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారతీయ రైల్వే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ రైలులో 10 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలులో రెండు ‘హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు’ ఉంటాయి. జూలై 17న జింద్ – సోనిపత్ మధ్య ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు, తన కార్యకలాపాల మొదటి వారంలో 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, 3,200 లీటర్లకు పైగా డీజిల్‌ను ఆదా చేయడంతో పాటు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో ఉండేవారికి గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.6 లక్షలకే 528 చ.అ అద్భుతమైన ప్లాట్‌..!

విద్యుత్ సామర్థ్యం విషయానికొస్తే.. ఇవి ఉమ్మడిగా 2,400 kW శక్తిని అందిస్తాయి. బ్యాటరీ, ఇంధన మద్దతు ఉంటుంది. దీనికి అనుబంధంగా ‘లిథియం ఐరన్ ఫాస్ఫేట్’ బ్యాటరీలు, హైడ్రోజన్ సిలిండర్లు అమర్చబడి ఉంటాయి. హైడ్రోజన్ ఇంధనాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి, సరఫరా చేయడానికి రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఈ రైలులో సుమారు 3,000 కిలోల నిల్వ సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్‌ను 500 బార్ (bar) పీడనం వద్ద నిల్వ చేసి, 350 బార్ వద్ద ఫిల్లింగ్ చేస్తారు.

మొదటి ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ కేంద్రం

హర్యానాలోని జింద్ (Jind) వద్ద భారతీయ రైల్వే తన మొదటి ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భద్రతకు పెద్దపీట వేసింది రైల్వే. హైడ్రోజన్ ఇంధనం వినియోగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యున్నత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ట్రైణ్‌లో గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను తక్షణమే గుర్తించేందుకు స్వతంత్ర భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.

ఆటోమేటిక్ షట్‌ఆఫ్:

ప్రమాద సూచన కనిపిస్తే ఇంధన సరఫరాను నిలిపివేసే ‘ఆటోమేటిక్ షట్-ఆఫ్’, నిరంతర గాలి సరఫరా (Ventilation) వ్యవస్థలను అమర్చారు. సోనెపట్ మార్గంలో విజయవంతమైన ప్రాజెక్ట్ తర్వాత, త్వరలోనే ఢిల్లీ రూట్‌లో కూడా దీని ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

గ్లోబల్ లీడర్‌షిప్ దిశగా భారత్

భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు. ఇది దేశంలో స్వదేశీ హైడ్రోజన్ రైలు రవాణా వ్యవస్థకు గట్టి పునాది వేసింది. పర్యావరణ హితమైన, జీరో-ఎమిషన్ (సున్నా ఉద్గారాలు) రవాణా పట్ల భారత్ ఉన్న కట్టుబాటును చాటిచెబుతూ, భవిష్యత్తులో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

ఇది కూడా చదవండి: మధ్యతరగతి కుటుంబాలకు గుడ్ న్యూస్.. తక్కువ ధర.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 7 బెస్ట్ స్కూటర్లు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us