AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే ఊహించని షాక్..

Vaibhav Sooryavanshi batting: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తూ కేవలం 8 బంతుల్లోనే 20 పరుగులు పిండుకున్నాడు. ఫోర్లు, సిక్సర్ల సునామీతో పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు.

4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే ఊహించని షాక్..
Zim Vs Ind 2nd T20i Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Jul 25, 2026 | 5:04 PM

Share

Vaibhav Sooryavanshi batting: రెండో టి20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గట్టి షాకే ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఏమాత్రం లేట్ చేయకుండా భారీ షాట్లకు దిగాడు. జింబాబ్వే ప్రధాన పేసర్ రిచర్డ్ న్గారవా వేసిన మూడో ఓవర్లో వైభవ్ విశ్వరూపం చూపించాడు. న్గారవా వేసిన వరుస బంతులను మైదానం నలుమూలలకూ బాదుతూ ఒకే ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉండటం విశేషం. వైభవ్ దెబ్బకు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, బౌలర్లు ఏం చేయాలో పాలుపోక తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. అయితే, ఆ తర్వాత బంతికే పెవిలియన్ చేరడంతో బుడ్డోడు రెండో గేమ్‌లో 20 పరుగులకే పరిమితమయ్యాడు. కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి ఉన్న కొద్దిసేపు ఆగమాగం చేశాడు.

222 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం..

కేవలం 9 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ, ఏకంగా 222 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో 20 పరుగులు చేశాడు. మొదటి టి20లోనూ కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం సాధించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అదే జోరును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ తనలోని అసలైన హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. టీమిండియా యువ ఓపెనింగ్ జోడీలో వైభవ్ అందిస్తున్న ఆరంభాలు జట్టుకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us