Akepati Amarnath Reddy: అన్నమయ్య మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న కడప జడ్పీ చైర్మన్ అమర్నాథ్‌రెడ్డి
కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య మార్గంలో తిరుమల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Akepati Amarnath Reddy: కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య మార్గంలో తిరుమల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల కురుసిన భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ దెబ్బతిన్నది. దీంతో తిరుపతి నుంచి తిరుమల చేరుకునే భక్తులు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అన్నమయ్య నడిచిన మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అన్నమయ్య మార్గం అభివృద్ధికి టీటీడీ ఆమోదం తెలపడం కడప జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు ఆకేపాటి అమరనాధ్ రెడ్డి. తిరుమలలోని పార్వేట మండపం వద్ద అమరనాధ్ రెడ్డికి ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. కడప జిల్లా రాజంపేట నుండి 4 రోజులుగా రెండువేల మంది భక్తులతో కలిసి పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నారు. కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేసింది టీటీడీ. ఎప్పటి నుండో అన్నమయ్య మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావలని కోరుతున్నామని ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. ఇప్పటికీ 19 సార్లు అన్నమయ్య మార్గంలో కాలినడకన తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ కల నెరవేరబోతుందన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా తనతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు అన్నమయ్య మార్గంలో పాదయాత్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు. చాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాది మంది భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అని అన్నారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సంకల్పించారు..ఆయన మరణంతో ప్రతిపాదన మరుగున పడిందని చెప్పారు. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని కోరినట్లు గుర్తుచేశారు. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి కూడా వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. టీటీడీ పాలక మండలి తమ విన్నపాన్ని మన్నించి అన్నమయ్య మార్గం అభివృద్ధికి ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది నుండి కొత్త నడకదారిలో నడుస్తామని తమకు నమ్మకం ఉందని ఆకేపాటి అమర్ నాథరెడ్డి అన్నారు.
అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య మార్గంలో నడిచి తిరుమలకు రావడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఆకేపాటి అమర్నాత్ రెడ్డితో కలిసి వేలాదిగా పేద భక్తులు అన్నమయ్య మార్గంలో తిరుమలకు రావడం జరుగుతోందని తెలిపారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు టీటీడీ పాలక మండలి అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. అన్నమయ్య మార్గంలో కొండచరియలు కనిపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేసి పవిత్రమైన పాటలతో మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నమయ్య మార్గంలో వేలాది మంది భక్తులు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు.
Read Also…. AP Government: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ఒక నెల డీఏ బకాయిలు విడుదల చేసిన ఆర్ధిక శాఖ