JC Prabhakar Reddy: మరోసారి రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏకంగా కలెక్టర్‌పైనే ఫైర్

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మరోసారి కోపం వచ్చింది. ఈ సారి కోపన్నంతా ఏకంగా కలెక్టర్‌కి చూపించారు. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.. డాక్యుమెంట్లను బెంచిపై పడేసి ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

JC Prabhakar Reddy: మరోసారి రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏకంగా కలెక్టర్‌పైనే ఫైర్
Jc Prabhakar Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 07, 2022 | 4:04 PM

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి మరోసారి కోపం వచ్చింది. ఈ సారి కోపన్నంతా ఏకంగా కలెక్టర్‌కి చూపించారు. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.. డాక్యుమెంట్లను బెంచిపై పడేసి ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. సజ్జలదిన్నె గ్రామంలోని కోట్ల రూపాయల భూమిని కొందరు కాజేస్తున్నారంటూ.. సోమవారం స్పందన కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని కలిశారు. ఈ క్రమంలో అధికారుల తీరును నిరసిస్తూ మండిపడ్డారు. వెంట తెచ్చిన డాక్యుమెంట్లను చూపిస్తూ చిటపటలాడారు. ఈ విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లను అధికారులకు చూపిస్తూ ఆగ్రహంతో వాటిని చించేశారు.

సజ్జలదిన్నె గ్రామంలోని భూములకి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. వాటిని కొంతమంది కాజేస్తున్నారన్నది జేసీ ప్రభాకర్ వాదన. ఈ విషయంలో అధికారులు న్యాయం చేయాలని కోరితే.. ఎందుకు పట్టించుకోరని జేసీ ప్రశ్నించారు. ఎవరో ఎమ్మెల్యే సొంత ప్రాపర్టీ అంటే అధికారులు ఎందుకు స్పందంచరని జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.

జేసీ ఆగ్రహంతో మాట్లాడుతుంటే.. కలెక్టర్ సిబ్బంది అడ్డుకోబోయారు. వారిని తోసేస్తూనే వాగ్వాదానికి దిగారు. దీంతో కలెక్టర్ ఆయన్ను అక్కడ నుంచి వెళ్లమని సూచించారు. ఒక మాజీ ఎమ్మెల్యేను నేను చెప్పేది ఏ మాత్రం వినకుండా నన్నే వెళ్లిపొమ్మంటారా అంటూ ఆగ్రహించారు. ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు.

ఇవి కూడా చదవండి

కలెక్టర్ అయినంత మాత్రానా ఎక్కువా.. అని ప్రశ్నించిన జేసీ.. తాను ఆ పదవికి గౌరవం ఇస్తానని వ్యక్తులకు కాదని వ్యాఖ్యానించారు. మొత్తానికి జేసీ ఫైర్ అండ్ ఫైర్‌ వ్యవహారం మరోసారి అనంతపురంలో హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..