Chandrababu: ఆ ముగ్గురు మాత్రమే రిపోర్ట్ ఇచ్చారు.. మంత్రుల జాతకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా?
మంత్రుల పనితీరును నేను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు? మీ శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు? వీటిపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది.. మరింత వేగం పెంచాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు.
మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరును నేను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు? మీ శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు? వీటిపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది.. మరింత వేగం పెంచాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. లేదంటే జరగబోయే నష్టాలేంటో కూడా సీఎం మంత్రులకు క్లియర్ కట్‌గా వివరించారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది.. అమరావతి పనులతోపాటు.. పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు.. మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
క్షేత్ర స్థాయి పర్యటనల ఆవశ్యకత
మంత్రులు సచివాలయానికి లేదా క్యాంప్ కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి ఇన్‌చార్జి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సీఎం మంత్రులకు హితబోధ చేశారు. జిల్లాలో జరుగుతున్న ప్రధాన సంఘటనలపై వెంటనే స్పందించాలనీ, డీఆర్సీ సమావేశాలను సక్రమంగా నిర్వహించి, నిర్ణయాల అమలు జరగడం చూడాల్సిన బాధ్యత మీ మీదే అంటూ అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.
పనితీరుపై నివేదికలు
మంత్రుల ఆరునెలల పనితీరుపై నివేదికలు ఇవ్వాలని కోరినా.. రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే నివేదికలు సమర్పించారని చంద్రబాబు తెలియజేశారు. ఇతర మంత్రుల ఈ నిర్లక్ష్య ధోరణి సహించలేమనీ, ప్రతి మంత్రి తన పనితీరుపై సచ్ఛీలంగా నివేదిక ఇవ్వాలని సీఎం ఘాటుగా హెచ్చరించారు.
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోక పోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి
టెక్నాలజీ వినియోగంపై కొందరు మంత్రులు తగిన శ్రద్ధ చూపడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. “సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులు వేగంగా పూర్తి చేయండి. ఫైళ్లను తక్షణం క్లియర్ చేయడం మాత్రమే కాదు, కిందిస్థాయి వరకు దస్త్రాలు త్వరగా పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా మంత్రులదే” అని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల వినియోగం పై సీఎం సూచనలు
మంత్రులు తమ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో వెనుకబడ్డారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రతి మంత్రిత్వశాఖలో సామాజిక మాధ్యమాల నిపుణులను నియమించండి. అవసరమైన శిక్షణ కూడా ఇవ్వండి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై స్పష్టమైన అవగాహన కలుగుతుందనీ సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ సహచరులకు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..