JC Prabhakar Reddy: జేసీ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం.. రెవెన్యూ ఉద్యోగుల వార్నింగ్..
జేసీ తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.జేసీ పద్ధతి మార్చుకుని క్షమాపణలు చెప్పకపోతే ఆందోళనలు..

వివాదాస్పద నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌పై విరుచుకుపడ్డ ఘటన తాడిపత్రిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జేసీ వైఖరిని ఉద్యోగ సంఘాలు, అధికార పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. జేసీ తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్ పట్ల వ్యవహరించిన తీరు బాధాకరం అన్నారు కేతిరెడ్డి పెద్దిరెడ్డి. జేసీ కుటుంబం గత 30 సంవత్సరాల నుండి అధికారులపై పెత్తనం ఎలా సాధించారో ఈ ఇష్యూ చూస్తే అర్థమవుతుందన్నారు కేతిరెడ్డి. జేసీ అంటే జోకర్, కామెడీ మ్యాన్ అని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే. మరోవైపు జేసీ తీరుపై ఉద్యో సంఘాలు మండిపడుతున్నాయి. సీనియర్ రాజకీయనేత అయిఉండి ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు రెవెన్యూ ఉద్యోగులు.వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.జేసీ పద్ధతి మార్చుకుని క్షమాపణలు చెప్పకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
నిన్న ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.. డాక్యుమెంట్లను బెంచిపై పడేసి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయల భూమిని కాజేస్తున్నారంటూ.. మండిపడ్డారు. అధికారుల తీరును నిరసిస్తూ మండిపడ్డారు. వెంట తెచ్చిన డాక్యుమెంట్లను చూపిస్తూ చిటపటలాడారు. ఏకంగా కలెక్టర్‌కే వార్నింగ్ ఇవ్వడం.. హాట్ టాపిక్‌గా మారింది. సజ్జలదిన్నెగ్రామంలోని భూములకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వాటిని కొంతమంది కాజేస్తున్నారన్నది జేసీ ప్రభాకర్ వాదన. ఈ విషయంలో అధికారులు న్యాయం చేయాలని కోరితే.. ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు జేసీ.
కలెక్టర్‌తో వాగ్వివాదానికి దిగిన సమయంలో వారించడానికి ప్రయత్నించిన కలెక్టర్ బాడీగార్డును కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కకు తోసేశారు. రెండు చేతులతో ఆయనను వెనక్కి నెట్టారు. తనకు పంపించిన డాక్యుమెంట్లపై సంతకం చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కలెక్టర్‌ను నిలదీశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
పదవులకు గౌరవం ఇస్తానే తప్ప.. వ్యక్తలకు ఇవ్వనని తెగేసి చెప్పారు. సజ్జలదిన్నె భూములకు సంబంధించినవిగా చెబుతున్న ప్రాపర్టీ డాక్యుమెంట్లపై జిల్లా రెవెన్యూ అధికారులు సంతకం పెట్టి పంపించడాన్ని ఆయన తప్పుబడుతున్నారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం