Janasena Pawan Kalyan: బద్వేల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జనసేన.. ఆ నిర్ణయానికి కారణమేంటంటే..

Janasena Pawan Kalyan: బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. బద్వేల్ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Janasena Pawan Kalyan: బద్వేల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జనసేన.. ఆ నిర్ణయానికి కారణమేంటంటే..
Pawan Kalyan
Follow us

|

Updated on: Oct 02, 2021 | 9:54 PM

Janasena Pawan Kalyan: బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. బద్వేల్ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బద్వేల్ అసెంబ్లీకి జరుగనున్న ఉప ఎన్నికలలో జనసేన నుంచి అభ్యర్థిని పోటీకి నిలుపడం లేదని పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. శనివారం నాడు అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. బద్వేల్ ఎన్నికపై సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చిందని, చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని స్పష్టం చేశారు.

బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో పార్టీ నాయకులతో చర్చింని తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వాస్తవానికి బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయమని పార్టీ శ్రేణుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే, చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని అన్నారు. ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఇతర పార్టీలకూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ నిర్ణయంతో.. బద్వేల్‌లో వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. టీడీపీ సైతం ఇదే నిర్ణయం తీసుకున్నట్లయితే.. వైసీపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.

Also read:

EPS డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే..! లేదంటే సాధ్యంకాదు..

Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ పరువాలు పొగడతరమా… మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ..

Siddharth Tweet: నెట్టింట తెగ వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..