AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఉన్నపలంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన పవన్‌.. పర్యటనపై ఉత్కంఠ.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉన్నపలంగా విజయవాడ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ను గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కు పవన్‌ చేరుకున్నారు. కాసేపటి క్రితం ఎయిర్ట్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన పవన్‌ అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయదుల దేరారు. ఇదిలా ఉంటే పవన్‌ పర్యటనపై మీడియాకి...

Pawan Kalyan: ఉన్నపలంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన పవన్‌.. పర్యటనపై ఉత్కంఠ.
Pawan Kalyan (file Photo)
Narender Vaitla
|

Updated on: May 25, 2023 | 2:52 PM

Share

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉన్నపలంగా విజయవాడ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ను గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కు పవన్‌ చేరుకున్నారు. కాసేపటి క్రితం ఎయిర్ట్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన పవన్‌ అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయదుల దేరారు. ఇదిలా ఉంటే పవన్‌ పర్యటనపై మీడియాకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం గమనార్హం. దీంతో పవన్ విజయవాడ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. అసలు పవన్‌ విజయవాడ ఎందుకు వెళ్లారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇదిలా ఉంటే జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని పవన్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అలాగే అక్కడి నుంచి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి పవన్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ ప్రైవేట్‌ కార్యక్రమం ఏమై ఉంటుందన్ని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందులోనూ పర్యటనపై మీడియాకి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏదేనా రహస్య భేటీలు ఉండొచ్చన్న చర్చ జరుగుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరి పవన్‌ పర్యటన వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..