AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం.. త్వరలో వారిని పరామర్శిస్తా: పవన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాతల మరణం కలచివేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan: చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం.. త్వరలో వారిని పరామర్శిస్తా: పవన్‌
Pawan Kalyan
Balaraju Goud
|

Updated on: Apr 02, 2022 | 2:55 PM

Share

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో అన్నదాతల మరణం కలచివేసిందని జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 73మంది కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారంటేసాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోందన్నారు. ప్రతి కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు పవన్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కొంతైనా ఊరట కోసం జనసేన పక్షాన ఆర్థిక సాయం అందిస్తాం. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామ”ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు కొంతైనా అండగా ఉండాలని జనసేనా పార్టీ నిర్ణయించిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్నీ త్వరలోనే పరామర్శిస్తానన్నారు పవన్ కల్యాణ్. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. కౌలు రైతుల బాధలు వింటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. రైతులు, కౌలు రైతుల పక్షాన జనసేన పార్టీ నిలుస్తుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు… వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామన్నారు.

మనం ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుందన్నారు. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు.. పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు. ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదు. కనీసం అధికారులు కూడా పరామర్శించకపోవడం విచారకరమన్నారు. జనసేన పార్టీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
IPL 2026 Auction: రికార్డ్ ప్రైజ్ కోసం మైండ్ బ్లోయింగ్ స్కెచ్
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఆంధ్ర స్పెషల్.. గోంగూర చికెన్ కర్రీ.. మీ కిచెన్‎లో సింపుల్‎గా..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగళం.. అంతకుముందే వలలో చిక్కి..
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
బీపీ పేషెంట్లకు వరం.. ఇలా చేస్తే రక్తపోటు పరార్!
అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..
అయ్యో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు..
పొద్దు పొద్దున్నే గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. చివరకు
పొద్దు పొద్దున్నే గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత.. చివరకు
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్..
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్..
ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే
ఏపీలో సంక్రాంతి నుంచి అన్ని సేవలూ ఆన్ లైన్ లోనే