AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ మేలు కోసమే అంటూ తన మార్క్ కామెంట్స్

పొత్తులపై పవన్ స్పందించారు. మళ్లీ వైసీపీ వస్తే.. ఏపీ పరిస్థితి మరింత దిగజారిపోతుందన్నారు. పొత్తులు అనేది ప్రజలకు ఉపయోగపడితే పరిశీలిస్తామని.. ఇతర పార్టీలతో జట్టు కట్టడం వల్ల వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ప్రయోజనాలు అక్కర్లేదన్నారు.

Pawan Kalyan: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ మేలు కోసమే అంటూ తన మార్క్ కామెంట్స్
Pawan Kalyan
Ram Naramaneni
|

Updated on: May 08, 2022 | 4:21 PM

Share

నంద్యాల జిల్లా వెంకటేశ్వరపురంలో పర్యటించారు జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త నాగసుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత మృతుడి భార్య భూలక్ష్మికి పార్టీ తరఫున లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌. లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేసిన పవన్‌కల్యాణ్‌కు నాగసుబ్బరాయుడు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పొత్తులపై కీలక కామెంట్స్ చేశారు పవన్. తాము ప్రస్తుతానికి బీజేపీ(Bjp)తో పొత్తులో ఉన్నామని.. మోదీ అంటే గౌరవం ఉందన్నారు. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, అభివృద్ధి కోసం పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. ఈ విషయంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. డైరెక్ట్‌గా చంద్రబాబు(Chandrababu) పొత్తుల ప్రస్తావన తీసుకువస్తే ఆలోచిస్తాం అని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని పవన్ అన్నారు. మరోసారి వైసీపీ వస్తే.. ఆంధ్రప్రదేశ్ మరింత దిగజారిపోతుందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

కాగా రెండు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అన్ని పక్షాలు కలిసి రావాలి, అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ కలిసి వస్తుందా? టీడీపీతో పొత్తుకు సై అంటోందా అంటే తనదైన శైలిలో స్పందించారు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. మోదీ సమక్షంలో ముందుకు వెళ్తామన్న ఆయన.. 2014 వేరు 2024 వేరంటూ స్పష్టం చేశారు. ఇండైరెక్ట్‌గా పొత్తులకు సుముఖంగా లేనట్లు ప్రకటించారు.

Also Read: ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్‌.. సీసీ ఫుటేజ్ చూసి పోలీసులు షాక్