Pawan Kalyan: ఇలాంటి జీఓ ఉంటే.. జగన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా..? జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్..
ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు.. ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1ని తీసుకువచ్చారంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Pawan Kalyan On YS Jagan: ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు.. ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1ని తీసుకువచ్చారంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా? అంటూ ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత అంటూ పేర్కొన్నారు. ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబరులోనే వెల్లడించారంటూ విమర్శించారు. వాహనంలో నుంచి కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు అని, హోటల్ నుంచి బయటకు రాకూడదు అని నిర్బంధాలు విధించారని.. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారంటూ మండిపడ్డారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
‘‘ఆ పెడ పోకడలనే అక్షరాల్లో ఉంచి జీవో ఇచ్చారు. ఈ ఉత్తర్వులు బూచి చూపి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాను. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. చంద్రబాబు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా? ఈ ఉత్తర్వులు శ్రీ జగన్ రెడ్డికి వర్తిస్తాయా? లేవా?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకివస్తుందో రాదో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలి. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వం తీసుకువస్తున్న పాలకుల విధానాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి.’’ అంటూ పవన్ పిలుపునిచ్చారు.
ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు యాత్రలు చేయచ్చు, రోడ్ షోలు చేయచ్చు కాని; ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు – ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతే ఎలా?? మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా??
— Pawan Kalyan (@PawanKalyan) January 4, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..