Chandrababu: రెండో రోజు కుప్పంలో చంద్రబాబు టూర్.. కార్యాచరణపై బూత్ కమిటీలతో సమావేశం..

కుప్పంలో కుస్తీ పోటీలు. నిన్నంతా ఇవే యాక్షన్ సీన్లు. ఇవాళా రేపూ కూడా కంటిన్యూ ఐనా కావొచ్చు. ఎందుకంటే మూడురోజుల మకాం కోసం కుప్పం వెళ్లిన చంద్రబాబు చైతన్యరథానికి మొదటిరోజే బ్రేకులు పడ్డాయి. ఖబడ్దార్ అని టీడీపీ అధినేత హెచ్చరిస్తే...

Chandrababu: రెండో రోజు కుప్పంలో చంద్రబాబు టూర్.. కార్యాచరణపై బూత్ కమిటీలతో సమావేశం..
Chandrababu
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 05, 2023 | 8:27 AM

రోడ్‌ షోకు పర్మిషన్‌ ఎందుకివ్వరు. నా నియోజకవర్గంలోకి నేనెందుకు వెళ్లకూడదు. 5 కోట్ల మంది తరఫున అడుగుతున్నా ఆన్సర్‌మీ… కోపంతో ఊగిపోయిన చంద్రబాబు.. దిక్కులు చూస్తూ నిలబడిపోయిన పోలీసులు. ఇదీ సీను. ముందుగా ఊహించిందే. కానీ… ఆ సాయంత్రం వేళ కుప్పంలో ఆకాశం ఇంత ఎరుపెక్కుతుందన్న అంచనా అయితే ఎవ్వరికీ లేదు. కందుకూరు, గుంటూరు.. రెండు వరుస విషాదాలు.. ఏపీ రాజకీయాన్ని మెలితిప్పేస్తున్నాయి. అయినా సరే… ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ కుప్పంలో మూడురోజుల పర్యటనకు స్కెచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. బెంగుళూరు నుంచి విజయవంతంగా విమానం దిగినప్పటికీ.. కుప్పం రోడ్ల మీద నో ఎంట్రీ బోర్డు వెక్కిరించింది. బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న 300 మంది పోలీసులు.. టీడీపీ శ్రేణుల్లో అసహనం… ఆక్రోశం.

అయితే ఇవాళ కూడా చంద్రబాబు పర్యటనకు ఉండటంతో పోలీసులు అడ్డుకుంటారా..? అనుమతి ఇస్తారా అనే ఉత్కంఠ నెకలొంది. ఇవాళ ఉదయం కుప్పం ఆఫీస్‌లో బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు చంద్రబాబు.  పోలీసుల ఆంక్షలు, వైసీపీ సర్కారు తీరుపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. నిన్న నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు.

నిన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభలకో రూలు, నాకో రూలా.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా చేసుంటే… ఇప్పటి ముఖ్యమంత్రి రోడ్లమీద తిరిగేవాడా.. అంటూ… ఇప్పుడు ముఖ్యమంత్రి సభలు జరుగుతున్న తీరును ఎండగట్టారు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం