AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jallikattu: హింస వాదనపై నెగ్గిన సంప్రదాయ’వాదం’! సీమకూ పాకిన తమిళ సంస్కృతి సంప్రదాయం!

బలం ఉన్న దాన్ని తన వశం చేసుకోవాలనేది మనిషి నైజం. అంత పెద్ద ఏనుగునే చిన్న కర్రపుల్లతో ఆడిస్తూ.. రూపాయి పెడితే చాలు తొండంతో ఆశీర్వదించేలా చేయగలిగాడు మనిషి. ప్రతి జంతువును తన గుమ్మానికి కట్టేసుకున్నాడు. పశువును లొంగదీసుకోవడం మొదట్లో ఆశ్చర్యం, అద్భుతంగా అనిపించింది. తరువాత అదే ఒక ఆటగా, వేటగా మారింది. క్రమంగా సంప్రదాయంగానూ విరాజిల్లింది. అలా పుట్టిందే తమిళనాట జల్లికట్టు. కన్నడిగుల కంబళ. ఆంధ్రలో పశువుల పండగ. జంతు ప్రేమికుల దృష్టిలో ఇదంతా హింస. కాని, సంప్రదాయ క్రీడ అని చెప్పేవారి కోణంలో అదొక ఆరాధన. ఆ సంప్రదాయం వెనక జంతు సంరక్షణ దాగుందన్నది నిజం కూడా. ఇప్పటికీ ఆ జాతి ఎద్దులు మనుగడ సాగిస్తున్నాయంటే కారణం.. ఆ పశువుల పండగే. ఎంతోమందికి జీవనోపాధి కూడా. అందుకేగా.. జంతుప్రేమికుల వాదన వీగిపోయి సంప్రదాయవాదుల గళం గెలిచింది. ఇరువైపుల వాదనలు విన్న తరువాతనే కదా.. జల్లికట్టు, కంబళ ఆచారాలని, వాటిని నిషేధించలేమని సుప్రీం చెప్పింది. ఆ ఆచారంలో నిజాయితీ ఉందనడానికి సాక్ష్యం.. మూడురోజుల సంక్రాంతిలో ముక్కనుమను పూర్తిగా జంతువులకు కేటాయించడమే. అందుకే, రాజకీయ ఒత్తిళ్లకు చట్టం సైతం తలొగ్గాల్సి వచ్చింది. ఆనాటి నుంచి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆ పశుక్రీడ ఇప్పుడు క్రమంగా విస్తరిస్తోంది. ఏపీలోనూ జల్లికట్టుకు అభిమానగణం పెరుగుతోంది. పట్టరపట్టు అంటూ జల్లికట్టులో యువత పాల్గొంటోంది. ఇంతకీ.. ఇదొక సంప్రదాయంగా ఎలా మారింది.

Jallikattu: హింస వాదనపై నెగ్గిన సంప్రదాయ'వాదం'!  సీమకూ పాకిన తమిళ సంస్కృతి సంప్రదాయం!
Jallikattu
Ram Naramaneni
|

Updated on: Jan 16, 2026 | 9:28 PM

Share

క్యాలెండర్ మారగానే వచ్చే తొలి పెద్ద పండగ సంక్రాంతి. అప్పాలు, పండగ సంబరాల కంటే కూడా.. కోళ్లు, జంతువులతో జరిగే క్రీడలే అసలు సంక్రాంతి అన్నట్టుగా మార్చేశారు. ఆంధ్రాలోనే కాదు.. తమిళనాట కూడా ఇదే సంప్రదాయం. ఈ రెండు రాష్ట్రాల్లో కామన్‌గా కనిపించే ఓ పశు క్రీడ.. జల్లికట్టు. తమిళనాడులో దాన్ని జల్లికట్టు అంటారు, ఆంధ్రాలో మాత్రం పశువుల పండుగ అంటుంటారు. ఈ రెండింటికీ మధ్య తేడా ఉందంటుంటారు. ఇంతకీ.. ఏంటీ వ్యత్యాసం? కొమ్ములు తిరిగిన ఎద్దులు బరుల వెంట పరుగులు తీస్తుంటే.. కండలు తిరిగిన యువకులు వాటిని లొంగదీసుకోవడమే కదా. జల్లికట్టులోనైనా, పశువుల పండుగలోనైనా.. ఆ ఎద్దులను జరిగేది అదే కదా. మరి.. తేడా ఏంటి? గాలి పటాలు, రంగవళ్లులు, పిండివంటలు, కోడి పందెలు, ప్రభలు, పడవ పోటీలు.. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే ఇదే. కాని, కాస్త సీమ వైపు వెళ్తే పండగ వాతావరణం మరోలా ఉంటుంది. ప్రతి సంక్రాంతి వేళ చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండగకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇది ఆంధ్రా జలికట్టు. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); చిత్తూరు జిల్లాలో జరిగే ఆంధ్రా జల్లికట్టులో పందేలుండవ్. బెట్టింగులూ ఉండవ్. పశువులను గౌరవించే పద్దతే ఉంటుందిక్కడ. పైగా కొత్తగా పుట్టుకొచ్చింది కాదిది. తరతరాల సంప్రదాయం. అందుకే, అంబరాన్నంటే ఆ సంబరాలు చూడ్డానికి ఏపీలోని నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి, చుట్టుపక్కల కర్నాటక, తమిళనాడు నుంచి జనం తరలివస్తారు. జల్లికట్టు చూడ్డానికి తమిళనాడుకు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కొమ్ములు దూస్తూ.. కాలు దువ్వుతూ.. కోడెలు దూసుకొస్తున్న వేళ
కొమ్ములు దూస్తూ.. కాలు దువ్వుతూ.. కోడెలు దూసుకొస్తున్న వేళ
ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు