AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Catechers: విశాఖలో యోగా డేకి భారీ ఏర్పాట్లు.. రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!

యోగా పండగ కోసం తీర సాగరం ముస్తామైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నగర కూడళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా మారుస్తున్నారు. 'యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్' నినాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

Snake Catechers: విశాఖలో యోగా డేకి భారీ ఏర్పాట్లు.. రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
Vizag Yoga Day
Eswar Chennupalli
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 20, 2025 | 1:38 PM

Share

యోగా పండగ కోసం తీర సాగరం ముస్తామైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నగర కూడళ్లను చూపుతిప్పుకోనివ్వకుండా మారుస్తున్నారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగాంధ్రతో రెండు గిన్నిస్‌ రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా విశాఖలో 30 కిలోమీటర్లు పరిధిలో దాదాపు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేశారు.. శనివారం విశాఖలో నిర్వహించే యోగా డే చరిత్రలో నిలిచిపోనుంది.. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్నం ఒక వైపు సముద్రతీరపు శాంతి, మరోవైపు తూర్పు కనుమల ఆకర్షణ.. కాని ఇదే భౌగోళిక స్వభావం ఇప్పుడు యోగా మహా సంగమం వంటి భారీ కార్యక్రమాల నిర్వహణకు కేంద్రంగా మారుతోంది. అయితే.. ఇటీవల కాలంలో విశాఖపట్నం పరిసరాల్లో పాముల సంచారం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు.

పాములను నివారించేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ స్ప్రే

బీచ్ రోడ్ వెంబడి యోగా కార్యక్రమంలో పాల్గొనబోయే లక్షలాది మందిని దృష్టిలో ఉంచుకుని, అధికారులు ముందస్తుగా పాములను పట్టే 50 మందితో కూడిన ప్రత్యేక బృందంను మోహరించారు. ఈ బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అంతేకాదు, పాములను ఆకర్షించకుండా ఉండేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ ను స్ప్రే చేస్తూ.. నివారణ చర్యలు చేపట్టారు.

లెమన్ గ్రాస్ ఆయిల్ పాములకు అసహ్యమైన వాసన కలిగేలా చేస్తుంది. దీన్ని వేదిక పరిసర ప్రాంతాల్లో, అడవి ప్రాంతాలకు సమీపంలో విస్తృతంగా స్ప్రే చేశారు. జోడుగుళ్లపాలెం కొండ ప్రాంతంలో ముఖ్యంగా ఈ స్ప్రే అపరేషన్ నిర్వహించారు. ఇది నాణ్యమైన – పర్యావరణహితమైన మార్గం.. అలాగే హానికరం కాని పద్ధతి అని సిబ్బంది పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

బండరాళ్ల నుండి రక్షణ – బారికేడ్ల ఏర్పాటు..

కొండ ప్రాంతాల్లో ఉన్న వేదికల వద్ద పాములతో పాటు మరో సమస్య.. గల్లంతవుతున్న బండరాళ్లు. వీటిని నిరోధించేందుకు అధికారులు బారికేడ్లు, రబ్బరు మెట్లు, మెష్ కవర్లు వంటి రక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జోడుగుళ్లపాలెం వద్ద ఏర్పాటైన ప్రధాన వేదిక వద్ద పటిష్టంగా ఏర్పాటు చేశారు.

అప్రమత్తమైన యంత్రాంగం..

భారీ జన సమూహం హాజరవుతున్న నేపథ్యంలో జీవవిజ్ఞాన విభాగం, అటవీ శాఖ, స్థానిక పంచాయతీ – పోలీసు శాఖ సంయుక్తంగా మల్టీ లెవల్ ప్రణాళిక రూపొందించారు. పాము కనిపించిన చోట నిమిషాల్లో స్పందించేలా మేనువల్ మాప్, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక పద్ధతులు అమలులోకి వచ్చాయి.

ప్రకృతి ఒడిలో యోగా అనుభవం ఇవ్వాలని ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కానీ అదే ప్రకృతి కొన్ని విఘ్నాలను తీసుకురావచ్చు. కావున వాటిని శాంతియుత, శాస్త్రీయంగా బాధ్యతాయుతంగా ఎదుర్కొనేందుకు ఈ చర్యలు చేపట్టారు.

విశాఖపట్నం ఒక ప్రకృతి నగరం.. కనుక పాములు కనిపించడం తప్పకపోయినా, ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలు, వాటిని హానికరంగా కాకుండా తిప్పి పంపించే విధానాలు, లెమన్ గ్రాస్ ఆయిల్ వంటివి ఉపయోగం.. ఆలోచనాత్మకత విధానాన్ని చూపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..