AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే

రైలు ప్రయాణం ఒక చక్కని అనుభూతి.. ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.. ఇలా రైలు ప్రయాణం ద్వారా.. సుదూర ప్రాంతాలను సైతం ఉత్సాహంగా, ఉల్లాసంగా చేరుకుంటారు. రైలు తమని భద్రంగా గమ్యానికి చేరుస్తుందని ఓ నమ్మకం.. అందుకే.. మహిళలు, పిల్లలతో కుటుంబమంతా రైలు ప్రయాణం చేస్తారు..

ట్రైన్‌లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే
Bag Stolen In Train
B Ravi Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 20, 2025 | 12:42 PM

Share

రైలు ప్రయాణం ఒక చక్కని అనుభూతి.. ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.. ఇలా రైలు ప్రయాణం ద్వారా.. సుదూర ప్రాంతాలను సైతం ఉత్సాహంగా, ఉల్లాసంగా చేరుకుంటారు. రైలు తమని భద్రంగా గమ్యానికి చేరుస్తుందని ఓ నమ్మకం.. అందుకే.. మహిళలు, పిల్లలతో కుటుంబమంతా రైలు ప్రయాణం చేస్తారు.. ఇలాంటి తరుణంలో రైలులో ప్రయాణికులను టార్గెట్ చేసి దొంగలు రెచ్చిపోతుంటారు.. ఇలాంటి చోరీ ఘటనలు చాలానే ఉన్నాయి.. ప్రయాణికుల బ్యాగ్‌లు, బంగారం చోరీ చేసి అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు.. మరికొందరైతే.. బ్యాగ్ లను ట్రైన్ బయటకు విసిరి వేసి.. తరువాత స్టేషన్‌లో దిగి బ్యాగ్ ను తీసుకుని వెళ్ళిపోతుంటారు.. అయితే.. తాజాగా రైలులో దొంగిలించి బయటకు విసిరేసిన బ్యాగును పోలీసులు బాధితురాలుకు అప్పగించిన ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల ప్రకారం.. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాథోడ్ సురేష్ సతీమణి సంధ్య బుధవారం ఉదయం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో విజయనగరం వెళ్తున్నారు. ఈ క్రమంలో రైలు బోగిలో ఎక్కిన అగంతకుడు ఆమె బ్యాగును మెల్లగా తస్కరించాడు. ఆ తర్వాత.. బ్యాగును రైలు నుంచి బయటకు విసిరేసాడు. బ్యాగులో విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, పలు వస్తువులు ఉన్నాయి. బ్యాగ్ కనిపించకపోవడంతో విషయాన్ని బాధితురాలు భర్త సురేష్‌కు మరో ఫోన్ ద్వారా అందించింది.

దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బ్యాగులో ఉన్న ఫోన్ సిగ్నల్ ద్వారా ఆకివీడు చెరుకువాడల మధ్య బ్యాగు ఉన్నట్లు గుర్తించారు. సమాచారాన్ని ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజుకు అందించారు. వెంటనే స్పందించిన ఎస్ఐ సిబ్బందిని అప్రమత్తం చేశారు ఆకివీడు ఎస్సై నాగరాజు.. ఆకివీడు నుండి చెరుకువాడ వరకు ట్రాక్ వెంబడి వెతుకులాట ప్రారంభించారు.

కానిస్టేబుల్ శివ, విజయ్ చెరుకువాడ దగ్గర బ్యాగును గుర్తించారు. బ్యాగులో బంగారు నగలు, విలువైన వస్తువులతో పాటు సెల్‌ఫోన్ ఉన్నాయి. అనంతరం బ్యాగు బాధితురాలుకు అందజేశారు. అయితే. వెంటనే స్పందించి.. బ్యాగును గుర్తించిన ఎస్సైను సిబ్బందిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. రైలు ప్రయాణం చేసే వారు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..