Vijayawada: విజయవాడ టూ షిర్డీ.. ఇకపై 20 గంటల ప్రయాణం కాదు.. కేవలం 3 గంటల్లోనే!
ఇప్పటి వరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్ళాలంటే ట్రైన్ లోనే లేక హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ లో షిర్డీ చేరుకునే..
ఇప్పటి వరకు విజయవాడ నుండి షిర్డీ వెళ్ళాలంటే ట్రైన్ లోనే లేక హైదరాబాద్ వెళ్లి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ లో షిర్డీ చేరుకునే వాళ్ళు.ట్రైన్ లో జర్నీ అంటే 12 గంటలు పైనే సమయం పట్టే పరిస్థితి.అదికూడా నగర్సోల్ స్టేషన్నో లేక సాయి నగర్ స్టేషన్ లో దిగి అక్కడనుండి రోడ్ మార్గాన షిర్డీ చేరుకునే వాళ్ళు యాత్రికులు.కానీ ఇండిగో షిర్డీకి వెళ్లే సాయి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.
మార్చి 26 నుంచి ప్రతీ రోజు విజయవాడ నుంచి నేరుగా షిర్డీకి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.ప్రతీ రోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటీఆర్ 72-600 విమానం షిర్డీకి ఖరారు చేసారు.అందులో 72 మంది ప్రయాణీకుల వెళ్లే సామర్థ్యం ఉంది. ప్రతీ రోజు మధ్నాహ్నం 12.25 గంటలకు గన్నవరంఃలో బయల్దేరే ఈ విమానం 3 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. అదే విధంగా ప్రతీ రోజు షిర్డిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది అంటే షిర్డీ కేవలం 2 గంటల 50 నిమిషాల్లో చేరవచ్చు అన్నమాట. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి షిర్డీ కి ప్రారంభ టికెట్ ధర 4,246.. షిర్డీ నుండి రిటర్న్ టికెట్ ధర 4,639గా నిర్ణయించారు.