Andhra Pradesh: కృష్ణలంక యువకుడి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. మర్డర్ చేసింది ఎవరో తేల్చిన పోలీసులు..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Feb 08, 2023 | 4:17 PM

పేగు తెంచుకు పుట్టిన వాళ్లంటే తల్లిదండ్రులకు ఎనలేని అభిమానం. వారు పెరిగి పెద్దయి.. ప్రయోజకులు అవుతుంటే తల్లిదండ్రులకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కానీ.. వారు దారితప్పితే. వ్యసనాలు,..

Andhra Pradesh: కృష్ణలంక యువకుడి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. మర్డర్ చేసింది ఎవరో తేల్చిన పోలీసులు..
Krishnalanka Murder Case

పేగు తెంచుకు పుట్టిన వాళ్లంటే తల్లిదండ్రులకు ఎనలేని అభిమానం. వారు పెరిగి పెద్దయి.. ప్రయోజకులు అవుతుంటే తల్లిదండ్రులకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కానీ.. వారు దారితప్పితే. వ్యసనాలు, చెడు తిరుగుళ్లకు బానిసై.. నిత్యం వేధిస్తుంటే.. సరిగ్గా కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కుమారుడి వేధింపులు తట్టుకోలేక ఎవరూ లేని సమయంలో తల్లి.. రోకలి బండతో మోది దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు తమదైన స్టైల్ లో దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కృష్ణలంక పెద్ద అవుట్ల పల్లి లో కుమారుడిని తల్లి దారుణంగా హత్య చేసింది. నిన్న (మంగళవారం) దీప్ చంద్ అనే యువకుడు ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ధీర్ చంద్ ను తల్లే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలంగా అప్పులు చేసి తీర్చాలంటూ ధీర్ చంద్ తల్లితండ్రులను వేధిస్తున్నాడు. కుమారుడి వేధింపులతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఎలాగైనా కుమారుడిని అంతమొందించాలని ప్లాన్ వేశారు. నిన్న తెల్లవారుజామున రోకలిబండ తో ధీర్ చంద్ తలపై మోది హత్య చేశారు.

అనంతరం ఎప్పటిలాగా పొలం పనులకు వెళ్లి వచ్చి తన కొడుకును ఎవరో హతమార్చారంటూ రోదించారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ధీర్ చంద్ తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో కుమారుడిని తానే హతమార్చినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆత్కూరు పోలీసుల అదుపులో ధీర్ చంద్ తల్లి రామాను ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu