Amaravati: ఏపీ రాజధాని అమరావతి.. పార్లమెంట్ వేదికగా తేల్చి చెప్పిన కేంద్రం.. కానీ..

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి అని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది...

Amaravati: ఏపీ రాజధాని అమరావతి.. పార్లమెంట్ వేదికగా తేల్చి చెప్పిన కేంద్రం.. కానీ..
Amaravati
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 08, 2023 | 3:34 PM

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి అని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2015లో అమరావతి ని రాజధానిగా నాటి ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందన్న కేంద్రం.. ఆ తర్వాత 2020లో 3 రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపింది. ఈ చట్టాలను చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని వివరించింది. ఆ తర్వాత ఈ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

“ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటు జరిగింది. అమరావతి రాజధాని అని 2015లో నిర్ణయించారు. రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 లోనే నోటిఫై చేసింది. రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. 2020లో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లు తీసుకువచ్చే ముందు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు. రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని” కేంద్రం సమాధానం ఇచ్చింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మూడేళ్లుగా నలుగుతూనే ఉంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మరో వైపు.. మూడు రాజధానులు చేసి తీరతామని పాలకపక్షం స్పష్టం చేస్తోంది. ఎన్నో ఆటుపోట్ల తర్వాత రాష్ట్రానికి అమరావతే రాజధాని అని గతంలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అయినా.. వాటిని కూడా ఖాతరు చేయకుండా మూడు రాజధానుల వైపే మొగ్గు చూపడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?