Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరు మృతి..
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్‌లో వైర్ తెగిపోవడటంతో లిఫ్ట్ కింద పడిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న 8 మంది కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్‌లో వైర్ తెగిపోవడటంతో లిఫ్ట్ కింద పడిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న 8 మంది కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఆరుగురిని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో ప్రతి రోజు ఉదయం లిఫ్ట్ ద్వారా కార్మికులు పైకెళ్లి పనులు చేస్తుంటారు.ప్రతి రోజూలాగే ఇవాళ కూడా కార్మికులు లిఫ్ట్‌లో వెళ్తుండగా కొంత దూరంపైకి వెళ్లిన తర్వాత వైర్ తెగి పోవడంతో లిఫ్ట్ అమాంతం కింద పడిపోవడం ఈ ప్రమాదం జరిగిందీ..అయితే ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతున్నారు.ఇక అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు వీటీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వలన మాత్రమే ప్రమాదం జరిగిందని తోటీ కార్మికులు హాస్పిటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వీటిపిఎస్, పవర్ మేక్, కంపెనీల అధికారులు బోర్డు హాస్పటల్ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..