Andhra Pradesh: కృష్ణా జిల్లాలో నకిలీ పులిచర్మం విక్రయాలు.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నకిలీ పులిగోర్లను విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా కానూరులో నకిలీ పులిగోర్లు విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నకిలీ పులి చర్మాన్ని, నకిలీ పులిగోర్లను స్వాధీనం చేసుకున్నారు పెనమలూరు..

కాలం మారుతున్న కొద్దీ మోసాలు పెరుగుతున్నాయి. గతంలో అసలు వస్తువేదో, నకిలీ వస్తువేదో ఇట్టే తెలిసిపోయేది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. అసలు, నకిలీ వస్తువులను గుర్తించడం కొంత ఈజీ అవుతున్నా.. ఒరిజినల్, డూప్లికేట్ తేడా తెలియకుండా కూడా డూప్లికేటుగాళ్లు జాగ్రత్తపడుతున్నారు. దీంతో కొన్ని సార్లు అసలు, నకిలీ వస్తువులు గుర్తుపట్టడం కష్టం అవుతుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎక్కువు నకిలీ వస్తువులు ఉంటాయి. ఇటీవల కాలంలో కారం, పాలు, నూనె ఇలా ఎన్నో రకాలు నకిలీలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు జంతువుల చర్మల్లో కూడా నకిలీవి వస్తున్నాయి. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. పులి గోర్లు అంటే డిమాండ్ ఉంటుంది. చాలామంది పులిగోర్లను లాకెట్ గా ఉపయోగించి మెడలో వేసుకుంటుంటారు. కొంతమంది అయితే పులిగోరును బంగారు లాకెట్ కూడా చేయించుకుంటారు. దీనిని ఆసరగా తీసుకుని కొంతమంది నకిలీ పులిగోర్లను విక్రయిస్తుండటం సర్వసాధారణంగా మారిపోయింది.
తాజాగా నకిలీ పులిగోర్లను విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా కానూరులో నకిలీ పులిగోర్లు విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నకిలీ పులి చర్మాన్ని, నకిలీ పులిగోర్లను స్వాధీనం చేసుకున్నారు పెనమలూరు పోలీసులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురానికి చెందిన కానూరి వంశీ వెంకట లక్ష్మీనారాయణ , విజయ్ అనే వ్యక్తులు నకిలీ పులి చర్మాన్ని విక్రయిస్తున్నారు. ఈ నకిలీ పులిగోర్లు, చర్మాన్ని గన్నవరం ప్రాంతంలో విక్రయించేందుకు అర్ధరాత్రి కొందరితో బేరం కుదుర్చుకుంటుండగా, గస్తీలోని పోలీసులు నకిలీ ముఠాని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..