AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దడ పుట్టిస్తున్న దవళేశ్వరం.. లోతట్టు ప్రాంతాల్లో అల్లకల్లోలం..

Andhra Pradesh: ధవళేశ్వరం వద్ద వరదగోదారి విశ్వరూపం దడ పుట్టిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదారి ఉగ్రరూపం దాల్చింది.

Andhra Pradesh: దడ పుట్టిస్తున్న దవళేశ్వరం.. లోతట్టు ప్రాంతాల్లో అల్లకల్లోలం..
Dhavaleswaram
Shiva Prajapati
| Edited By: Team Veegam|

Updated on: Jul 16, 2022 | 1:35 PM

Share

Andhra Pradesh: ధవళేశ్వరం వద్ద వరదగోదారి విశ్వరూపం దడ పుట్టిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదారి ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడ నీటి మట్టం 23.50 అడుగులకు చేరి మహాసముద్రాన్ని తలపిస్తోంది. 23.63 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి ధవళేశ్వరానికి వరద పోటు ప్రమాదకరంగా మారింది. రాజమహేంద్రవరాన్ని వరద గోదారి చుట్టుముట్టింది. వరద నీటి ప్రవాహం గంటగంటకూ పెరుగోతూ లోతట్టు ప్రాంత ప్రజల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో ఏపీలోని 6 జిల్లాల్లో జలప్రళయం విలయతాండవం చేస్తోంది. దీంతో 600 లకు పైగా గ్రమాల్లో జనం ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు.

ఇక లంగ గ్రామాల్లో జనం గుండెలు గుప్పిట్లో పెట్టుకొని గడుపుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతికి దిగువ జనం గుండెల్లో గుబులు రేగుతోంది. అత్యధిక లంక గ్రామాలు సహా ఇప్పటికే అనేక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కకున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఊళ్ళకు ఊళ్ళనే ముంచెత్తిన వరద ప్రవాహం లోనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..