
అమరావతి, జులై 23: పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది … దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది…ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది… పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదు…
పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం లో వున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 & 5.8 కి.మీ మధ్య కొనసాగుతుంది అది రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం (ఉష్ణమండల తుఫాను WIPHA అవశేషం) ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో, తదుపరి 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో వున్నఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది… దీని ప్రభావం తో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది..
రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69మిమీ, నర్సన్నపేటలో 62.5మిమీ, కోటబొమ్మాళిలో 53.2మిమీ, మందసలో 48.7మిమీ, రాజాపురంలో 46.2మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7మిమీ వర్షపాతం నమోదైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.