AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏమైంది అక్కా మీకు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

సున్నితమైన భావాలు, శాంత స్వభావం అని భావించే ఆడవాళ్లు.. ఇప్పుడు కట్టుకున్నవాళ్లనే రకరకాల పద్దతుల్లో చంపేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఓ భార్య భర్తను నరికి, మృతదేహాన్ని అతడి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

Andhra: ఏమైంది అక్కా మీకు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య
Nandyal District
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2025 | 5:37 PM

Share

వంటింటి మహరాణులు.. సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్లు.. కాస్త కఠినంగా మాట్లాడితే నొచ్చుకునేవాళ్లు.. ఇది ఆడవాళ్లపై జనరల్‌గా అందరికి ఉండే అభిప్రాయం. అలాంటివాళ్లు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? కట్టుకున్న వాడిని ఖండ ఖండాలుగా నరికి చంపేస్తున్నారు. భార్య చేతిలో బలైపోయిన మరో భర్త కథ ఇది. ఈ దారుణం ఏపీలోని నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. భర్తను చంపి ఏకంగా డోర్ డెలివరీ చేసింది ఓ భార్య.  జిల్లాలోని నూనెప‌ల్లికి చెందిన ర‌మ‌ణ అనే వ్య‌క్తిని.. పిడుగురాళ్ల‌కు చెందిన ర‌మ‌ణ‌మ్మతో 20ఏళ్ల క్రితం పెళ్లయింది. కొంతకాలంగా  ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆమె మనసు మార్చుకుని కాపురానికి వస్తుందేమో అని కొన్ని రోజులు ఎదురుచూశాడు రమణ. రాకపోవడంతో నచ్చజెప్పేందుకు తనే వాళ్ల ఇంటికి వెళ్లాడు.  అయితే అక్కడ ఇంటి అల్లుడిని గౌరవించకపోగా.. ఆమె కుటుంబ స‌భ్యులు గొడవకు దిగారు. ఘర్షణ పెద్ద‌ది కావ‌డంతో ర‌మ‌ణ‌మ్మ , ఆమె సోదరుడు క‌లిసి ర‌మ‌ణ‌ కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డు స్పాట్‌‌లోనే మృతిచెందాడు. రమణయ్య మృతదేహాన్ని నంద్యాల‌కు తీసుకువ‌చ్చి అత‌డి ఇంటి ద‌గ్గ‌రే ప‌డేసి వెళ్లిపోయారు.  ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు.. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి 

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..