Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: మాస్టారు బెల్డ్ షాపుల్లో మద్యం తాగుతున్నారా.. ఈ విషయం తెలిస్తే మీ బుర్ర బ్లాంక్

మద్యం ప్రియులు తస్మాత్ జాగ్రత్త... ఏ మందు పడితే ఆ ముందు ... ఎక్కడపడితే అక్కడ కొనుక్కొని తాగేస్తున్నారేమో జర జాగ్రత్త... ఎందుకంటే ఆ మద్యం కంపెనీలో తయారయిందా... కేటుగాళ్లు తయారు చేస్తున్నారా అనేది ముందు తెలుసపకోండి.. ముఖ్యంగా మద్యం షాపులలో కాకుండా బెల్టు షాపులలో అమ్మే మద్యం ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీసి మరి తాగండి లేదా అంతే సంగతులు.. ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా... అక్రమార్కులు సొంతగా మద్యం తయారు చేసేసి... బ్రాండ్ మద్యం లేబుల్స్ సీసాలపై అంటించేసి ... ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడేస్తున్నారు... అందుకే ఇదంతా చెబుతున్నాం. అయితే ఈ అక్రమ మద్యం దారులు ఎక్కడ పట్టుబడ్డారు ఏంటి అనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Andhra News: మాస్టారు బెల్డ్ షాపుల్లో మద్యం తాగుతున్నారా.. ఈ విషయం తెలిస్తే మీ బుర్ర బ్లాంక్
Illicit Liquor
Follow us
Sudhir Chappidi

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2025 | 9:51 PM

తిరుపతి కేంద్రంగా జరుగుతున్న అక్రమ మద్యం తయారీ కేంద్రంపై కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు … అయితే దీనంతటికీ మూల కారణం గత నెల 29వ తేదీన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అనంతరాజుపేటలో ఎక్సైజ్ శాఖ అధికారులు 592 నకిలీ మద్యం బాటిల్స్ పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.. వారిని విచారించగా ఈ కథంతా బయటికి వచ్చింది.. తిరుపతి కేంద్రంగా అక్రమ మద్యం తయారు చేస్తున్నట్లు వారు వెల్లడించడంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన మూడు జిల్లాల అధికారులు తిరుపతిలో అక్రమ మద్యం తయారు చేస్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించారు.. ఆ దాడులలో 805 లీటర్ల స్పిరిట్, 34 వేల నకిలీ లేబుల్స్, 1641 మద్యం బాటిళ్లు, 7000 ఖాళీ మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఒక కారు, ఆరు లక్షల 5 వేల రూపాయల నగదు, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్, మద్యం తయారు చేసే మిషనరీని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు..వాటితో పాటు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు.

వీరు స్పిరిట్‌ను కొనుగోలు చేసి మార్కెట్లో అధికంగా వెళ్లే బ్రాండ్ల పేర్లతో అక్రమ మద్యం తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు… ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు తాగే బ్రాండ్లపైనే వారు దృష్టి పెట్టినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.. చీప్ లిక్కర్ , కొద్దిపాటి రేటు ఉండి ఎక్కువగా సేల్ అయ్యే బ్రాండ్లు ఎక్కువగా తయారవుతున్నాయని, ఆ తర్వాత ఓమాదిరి రేట్లు ఉండే మద్యం కూడా అధికంగానే తయారవుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.. బ్రాందీ షాపులలో ఈ అక్రమ మద్యం గుర్తించలేదని అయితే ఇవన్నీ కూడా బెల్ట్ షాపులే ధ్యేయంగా తయారు చేసి వాటిలో ఈ మద్యాన్ని కలిపేసి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. అందుకే మద్యం ప్రియులు ఎక్కడపడితే అక్కడ మద్యం కొనుగోలు చేయకుండా సంబంధిత దుకాణాలలో మాత్రమే మద్యం బాటిళ్లు కొనుగోలు చేయాలని, బెల్ట్ షాపులలో ఇలాంటి అక్రమ మద్యం తాగడం వల్ల కల్తీ అయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి