Alugu: అలుగు బతుకే గుబులు అయిపోయిందిగా..

అంతరించిపోతున్న జాబితాలో చేరిన వన్యప్రాణులను వదలడం లేదు అక్రమార్కులు. అధికారుల కళ్లు కప్పి వాటిని గట్టు దాటించేస్తున్నారు. ఎవరికీ ఏ హాని చేయని అలుగు.. ఇప్పుడు వారికి కాసులు కుమ్మరిస్తుంది..

Alugu: అలుగు బతుకే గుబులు అయిపోయిందిగా..
Pangolins
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 14, 2024 | 6:51 PM

మాయదారి కేటుగాళ్లు వన్యప్రాణులను వదిలిపెట్టడం లేదు. వాటిని స్మగ్లింగ్ చేసి కాసులు దండుకోవాలని ఆరాటపడుతున్నారు. అరుదైన జీవుల్ని వేటాసి సొమ్ము చేసుకుంటున్నారు. అంతరించబోతున్న జాబితాలో ఉన్న జీవి అలుగు. తాజాగా దీన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా.. సత్యసాయి జిల్లా పోలీసులు పట్టుకున్నారు.  కర్నూలు నుంచి 12 కిలోల బరువు ఉన్న అలుగును బెంగళూరుకు తరలిస్తుండగా.. కుటాగుళ్ల వద్ద ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

అలుగుకు ఇంటర్నేషనల్ మార్కెట్​లో కోట్ల విలువ ఉంటుందని ప్రచారం నేపథ్యంలో వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ జీవుల కోసం అడవులను జల్లెడ పడుతున్నారు స్మగ్లర్లు. చైనా, ఇతర దేశాలలో వివిధ రకాల మెడిసన్స్ కోసం దీనిని ఉపయోగిస్తారన్నది ప్రచారం. ధర  రూ.80 లక్షల నుంచి కోటి వరకు ధర ఉంటుందని వీటిని స్మగ్లింగ్ చేసేవారు చెబుతున్నారు. దీని ఒంటిపై ఉన్న పొలుసులతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కొన్ని రకాల ఆభరణాలు, వాలెట్ల తయారీకి అలుగును ఉపయోగిస్తారని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు చెబుతున్నారు. వీటిని విక్రయించేందుకు స్మగ్లర్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ కూడా వినియోగిస్తున్నారంటే.. వాటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే అలుగులను అక్రమ రవాణా చేస్తే.. చిప్ప కూడు తప్పదు. వన్యప్రాణి సంరణక్ష చట్టం-1972 ప్రకారంలో లోపలేస్తారు. పులి, అలుగు, ఇతర షెడ్యూల్‌-1లో పరిధిలోని ప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదవుతుంది. 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల ఫైన్ పడుతుంది. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే రూ.25 వేల ఫైన్… 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే చాన్స్ ఉంది. చీమలు, చెదలను తిని జీవనం సాగించే.. ఈ జీవి మనుషులకు కానీ ఎలాంటి హాని చేయదు. దాని బతుకు దాన్ని ప్రశాంతంగా బతకనివ్వండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..