AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa District: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన భర్త.. షాక్ ఇచ్చిన భార్య.. చివరికి కన్నతండ్రే ఆమెను..

Father Murdered Daughter: కపడ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కూతురు చేసిన పనికి కన్న తండ్రే ఆమె ప్రాణాలు తీశాడు.

Kadapa District: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన భర్త.. షాక్ ఇచ్చిన భార్య.. చివరికి కన్నతండ్రే ఆమెను..
Crime
Shiva Prajapati
|

Updated on: Mar 15, 2021 | 3:44 PM

Share

Father Murdered Daughter: కపడ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కూతురు చేసిన పనికి కన్న తండ్రే ఆమె ప్రాణాలు తీశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లాలోని వేంపల్లి పట్టణానికి చెందిన గురువేంధ్రతో రాజేశ్వరానికి చెందిన మహిళకు 2009లో పెళ్లి జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే బతుకుదెరువు కోసం గురువేంధ్ర దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ సంపాదించి నెల నెలా ఇంటికి డబ్బులు పంపించేవాడు. భర్త దుబాయ్‌కి వెళ్లడంతో.. అతని భార్య ప్రొద్దుటూరులోని తన తల్లిదండ్రుల ఉంటోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను పలుమార్లు వారించారు కూడా. అయినప్పటికీ ఆ మహిళ మారలేదు.

ఇదిలాకొనసాగుతూనే ఉండగా.. గురువేంధ్ర దుబాయ్ నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చాడు. దాంతో సదరు మహిళ మెట్టినిళ్లు అయిన వెంపల్లికి వచ్చింది. కానీ, గురువేంధ్రతో తాను ఉండనని సదరు మహిళ తెగేసి చెప్పింది. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా భర్తను బలవంతపెట్టింది. తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఇలా నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. దాంతో ఏం చేయాలో పాలుపోని గురువేంధ్ర.. ఆమెకు సర్దిచెప్పాలంటూ అత్తమామల వద్దకు తీసుకెళ్లాడు. కానీ, అక్కడా ప్రయోజనం లేకుండా పోయింది. పైగా ఘర్షణలు ఎక్కువ అయ్యి.. ఇంటి పంచాయతీ కాస్తా రోడ్డుకెక్కింది. తన కూతురు పరువు పోతోందని భావించిన ఆమె తండ్రి.. ఆమె మెడకు చున్నీ చుట్టి హత్య చేశారు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Corona Updates: తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

AIIMS Recruitment: నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష మొదలు రెండు లక్షల వరకు.. దరఖాస్తు చేసుకోండిలా..

నోటాపై ఎక్కువ ఓట్లు పోలైతే, ఎన్నిక చెల్లనిదిగా ప్రకటిస్తారా ? ‘పిల్’ పై కేంద్ర సమాధానానికి సుప్రీంకోర్టు ఆదేశం