AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS Recruitment: నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష మొదలు రెండు లక్షల వరకు.. దరఖాస్తు చేసుకోండిలా..

AIIMS Recruitment: నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రత్యక్ష నియామక ప్రాతిపదికన వివిధ..

AIIMS Recruitment: నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్ష మొదలు రెండు లక్షల వరకు.. దరఖాస్తు చేసుకోండిలా..
Nagpur Aiims
Shiva Prajapati
|

Updated on: Mar 15, 2021 | 3:20 PM

Share

AIIMS Recruitment: నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రత్యక్ష నియామక ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీ (గ్రూప్ ఎ) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 7 లోగా తమ దరఖాస్తులను ఇ-మెయిల్ ద్వార, ఏప్రిల్ 22వ తేదీలోగా పోస్టల్ ద్వారా పంపించాలని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకు భర్తీ చేయడానికి నాగ్‌పూర్ ఎయిమ్స్ ఈ నోటిఫికేషన్ విడుదలు చేసింది. కాగా, ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7 వ పేకమిషన్ పే లెవల్ 12, పే లెవల్ 13 ప్రకారం జీతం ఇవ్వబడుతుంది. ఒకవేళ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు రానట్లయితే ఆ పోస్టులను ఆయా కేటగిరిలోని కింది స్థాయి కేడర్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని ఎయిమ్స్ అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల పై పోస్టులకు అర్హత కలిగిన కిందిస్థాయి ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది.

జీతభత్యాలు.. అసోసియేట్ ప్రొఫెసర్: లెవెల్13-ఎ1+ వారికి రూ. 1,38,300-2,09,200 వరకు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్: లెవెట్12 రూ. 1,01,500-1,67,400 వరకు ఉంటుంది.

అసోసియేట్ ప్రొఫెసర్ అర్హతలు: 1. 1956 నాటి భారతీయ వైద్య మండలి చట్టం షెడ్యూల్ 1, 2, 3 ప్రకారం వైద్య అర్హతలు ఉండాలి. 2. పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్‌లో ఎండీ/ఎంఎస్ చేసి ఉండాలి.

అనుభవం: కనీసం ఆరేళ్ల బోధన అనుభవం, పరిశోధన అనుభవం, ఎండీ/ఎంఎస్ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

ఎయిమ్స్ నాగ్‌పూర్ రిక్రూట్‌మెంట్ 2021 సూపర్‌స్పెషాలిటీ విభాగాలకు అవసరమైన అర్హతలు.. M.Ch. శస్త్రచికిత్సా సూపర్ స్పెషాలిటీల కోసం సంబంధిత సబ్జెక్టు‌లో అర్హత కలిగి ఉండాలి. అనుభవం: M.Ch డిగ్రీ పొందిన తరువాత గుర్తింపు పొందిన సంస్థలో కనీసం నాలుగు సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత: ట్రామా, ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండి లేదా జనరల్ మెడిసిన్‌లో ఎండి లేదా జనరల్ సర్జరీలో ఎంఎస్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అనుభవం: MD / MS విద్యార్హత కలిగి.. గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల బోధన లేదా పరిశోధన అనుభవం ఉండాలి.

పూర్తివివరాల కోసం నాగ్‌పూర్ ఎయిమ్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చొడొచ్చు.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!