AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pensions: ఏపీలో పెన్షన్ అప్లై చేసుకోవడం ఎంత సింపులో తెల్సా..?

ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మంగళగిరిలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు బకాయిలు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది.

Andhra Pensions: ఏపీలో పెన్షన్ అప్లై చేసుకోవడం ఎంత సింపులో తెల్సా..?
NTR Bharosa Pensions
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2024 | 1:52 PM

Share

ఏపీవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50% మందికి నగదు పంపిణీ పూర్తయింది. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.  ఈ ఒక్క రోజే 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేసే దృక్ఫథంతో ముందుకు సాగుతున్నారు. ప్రణాళికలో భాగంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది పింఛనుదారులకు పింఛను అందజేసేలా బాధ్యతలు అప్పగించారు. ఇక తొలి రోజు అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛను అందజేస్తారు. పెన్షన్ పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు భాగమవుతున్నారు. అయితే ఏపీలో అర్హత ఉండి పెన్షన్ పొందాలంటే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

ఆఫ్​లైన్​లో ఇలా… 

తొలుత గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్… https://sspensions.ap.gov.in/SSP/Home/Index విజిల్ చేయండి. ఆ పోర్టల్​లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫామ్ సెలక్ట్ చేసి డౌన్‌లోడ్ చేయండి. ఆ ఫామ్‌ ఫ్రింట్ తీసి వివరాలు కరెక్ట్‌గా నింపండి. ఎక్కడా తప్పులు పడకుండా చూసుకోండి. ఆ ఫామ్‌కు  ఆధార్ కార్డ్, అడ్రస్ ఫ్రూప్, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.. ఇతర సంబంధిత పత్రాలు జత చేయండి. ఆపై వాటిని గ్రామ పంచాయతీ ఆఫీసులో సంబంధిత అధికారికి ఇవ్వండి.,

ఆన్‌లైన్‌లో ఇలా….

పెన్షన్లకు సంబంధించిన అధికారిక పోర్టల్… https://sspensions.ap.gov.in/SSP/Home/Index విజిల్ చేయండి. స్క్రీన్ కుడివైపున ఎగువన ఉన్న లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి.క్రెడెన్షియల్‌లను నమోదు తర్వాత.. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇవ్వండి. ఆ తర్వాత గెట్ OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై మీ రిజిస్టర్డ్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని అక్కడ ఎంటర్ చేయండి. అనంతరం మీరు ఫిల్ చేయాల్సిన పేజీ అక్కడ వస్తుంది. ఆ సూచనలు బట్టి ఆ ఫామ్ నింపండి. పెన్షన్ల సంబంధించి మీకు ఇంకా సాయం, సమాచారం కావాలంటే..  0866 – 2410017 కాల్ చేసి వివరాలు పొందవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..