AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ భార్యతో గొడవ.. అర్ధరాత్రి సినిమాటిక్ స్టైల్‌‌లో కసాయి భర్త ఏం చేశాడంటే..

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మారుతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న కాజా.. తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో తన వ్యసనాలకు అవసరమైన డబ్బులు..

పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ భార్యతో గొడవ.. అర్ధరాత్రి సినిమాటిక్ స్టైల్‌‌లో కసాయి భర్త ఏం చేశాడంటే..
Wife Husband representative image
Shaik Madar Saheb
|

Updated on: Feb 09, 2023 | 8:38 AM

Share

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మారుతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న కాజా.. తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో తన వ్యసనాలకు అవసరమైన డబ్బులు పుట్టింటి నుండి తీసుకురావాలని భార్య జుబేదాబిని వేధించేవాడు. కారు కొనుక్కోవాలనీ.. రెండు లక్షల రూపాయలు పుట్టింటి నుంచి తీసుకురావాలంటూ భార్య జుబేదాబిని ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని జుబేదాబి.. తన తల్లిదండ్రులకు వివరించింది. అల్లుడు వ్యసనాల గురించి తెలిసిన అత్తమామలు.. చేసేదేమీ లేక ముందుగా 20వేల రూపాయలను ఇచ్చారు. మిగిలిన డబ్బులు త్వరలోనే అందిస్తామని భరోసా కూడా ఇచ్చారు.

అయితే, తాను అడిగిన మొత్తం రెండు లక్షలు తీసుకురాలేదన్న కోపంతో అర్ధరాత్రి మద్యం మత్తులో జుబేదాబితో గొడవపడ్డాడు. వాళ్ల గొడవతో భయపడి నిద్రలేచిన పిల్లలు సౌమ్య తవేరా, అలియా.. ఏడుస్తూ తల్లిని హత్తుకున్నారు. పిల్లలు ఏడుస్తున్నా కనికరించని కాజా.. జుబేదాబీని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పిల్లలను బయటకు పంపించేశాడు. జుబేదాబి ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మంచేలా ఫ్యాన్‌కు వేలాడదీశాడు.

తల్లి కోసం ఏడ్చి సొమ్మసిల్లి పోయిన చిన్నారులను గుర్తించిన స్థానికులు.. జుబేదాబి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విగతజీవిగా మారిన తమ కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే గుత్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..