సంబంధం ఇష్టం లేదన్నందుకు చంపారు.. పరువు కోసం యువతిని హత్య చేసిన తల్లి, సోదరుడు..
ఆ అమ్మాయికి 17 ఏళ్లు.. కుటుంబ సభ్యులు సంబంధం చూశారు.. తనకు ఆ సంబంధం ఇష్టం లేదని.. నచ్చిన వ్యక్తిని చేసుకుంటానంటూ తల్లితో చెప్పింది.. దీంతో ఆమెతో కుటుంబసభ్యులు వారించారు.. చేసుకోవాలంటూ పట్టుపడ్డటంతో ఆమె వారి మాట వినలేదు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. పెళ్లి సంబంధం చూసిన వాళ్ళకు ఏం చెప్పాలా అని.. ఆమెతో తల్లి, సోదరుడు కలిసి తీవ్రంగా గొడవపడ్డారు..
ఆ అమ్మాయికి 17 ఏళ్లు.. కుటుంబ సభ్యులు సంబంధం చూశారు.. తనకు ఆ సంబంధం ఇష్టం లేదని.. నచ్చిన వ్యక్తిని చేసుకుంటానంటూ తల్లితో చెప్పింది.. దీంతో ఆమెతో కుటుంబసభ్యులు వారించారు.. చేసుకోవాలంటూ పట్టుపడ్డటంతో ఆమె వారి మాట వినలేదు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. పెళ్లి సంబంధం చూసిన వాళ్ళకు ఏం చెప్పాలా అని.. ఆమెతో తల్లి, సోదరుడు కలిసి తీవ్రంగా గొడవపడ్డారు.. అదే ఆమె పాలిట శాపమైంది. పరువు కోసం తల్లి, సోదరుడు కలిసి ఆమెను దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. తల్లి, సోదరుడు గొంతుకు చున్నీ బిగించి ఊపిరి ఆడకుండా చేసి క్రూరంగా చంపారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కన్న తల్లే కుమారుడితో కలిసి కన్నకూతురిని చంపడం కలిచివేసింది.. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కోమల(17) అనే యువతిని ఆమె తల్లి సోదరుడు కలిసి హత్య చేశారు. పెద్దలు చూసిన సంబంధం కాదని.. నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె మారాం చేయడంతో ఆగ్రహించిన తల్లి, సోదరుడు.. యువతిని చితకబాదారు. అంతటి ఆగకుండా చున్నీతో గొంతు బిగించి హతమార్చారు.
కోమలను చంపిన తర్వాత.. ఆమె తల్లి, సోదరుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.. యువతి మృతితో గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో విషాదం అలుముకుంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. తల్లి, కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి సంబంధం వివాదం హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ.. జరగిందని.. అది కాస్తా హత్య వరకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొంటున్నారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..