AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. పిల్లల ముందు అదేం పాడుపని.. అమ్మాయితో కలిసి హోంగార్డ్‌ ఏం చేశాడంటే..

గౌరవప్రదమైన వృత్తిలో ఉండి పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ హోంగార్డు మతితప్పి ప్రవర్తించాడు. చిన్నారుల ముందే.. ఓ మహిళతో అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తూ విర్రవీగాడు. అతని డ్యాన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ కావడతో అతని తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఛీ.. ఛీ.. పిల్లల ముందు అదేం పాడుపని.. అమ్మాయితో కలిసి హోంగార్డ్‌ ఏం చేశాడంటే..
Viral Video
Anand T
|

Updated on: Nov 25, 2025 | 3:18 PM

Share

గౌరవప్రదమైన వృత్తిలో ఉండి పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ హోంగార్డు మతితప్పి ప్రవర్తించాడు. చిన్నారుల ముందే.. ఓ మహిళతో అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తూ విర్రవీగాడు. అతని డ్యాన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌ కావడతో అతని తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా కనికపాడు పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్‌కు స్కూల్‌ పిల్లల ముందు ఒక మహిళతో అసభ్యకరంగా నృత్యం చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ వీడియో కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు తాజాగా అతన్ను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డ్ 304 B. అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలకు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

ప్రతి పోలీస్ సిబ్బంది, అధికారుల ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా ఉంచాలి గాని.. అప్రతిష్టకు గురి చేసేలా ఉండరాదని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మంచి విధి నిర్వహణ కనపరిస్తే ఏ విధంగా అభినందిస్తామో, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ సిబ్బందికి సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్