AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Man Dies: ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలు.. ఎముకలు కొరికే చలి.. దేశ సరిహద్దులో అమరుడైన వీర జవాన్

గడ్డ కట్టే చలిలో.. మంచు కొండల మధ్య జవాన్లు కాపలా కాయడం అత్యంత క్లిష్టమైన పని. ఒక్కోసారి చలికి, మంచు చరియలు విరిగిపడి సైనికులు అమరులు కావడం విషాదం నింపుతోంది.

Army Man Dies: ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలు.. ఎముకలు కొరికే చలి.. దేశ సరిహద్దులో అమరుడైన వీర జవాన్
Army Man Kartik Kumar Dies
Balaraju Goud
|

Updated on: Nov 07, 2021 | 8:31 AM

Share

Army Man Dies in Snow Slide: కుటుంబాలను వదిలేసి.. ప్రాణాలను లెక్క చేయకుండా మన సైనికులు సరిహద్దుల్లో విధులు నిరర్వర్తిస్తారు. శత్రువు కనిపిస్తే చాలు.. వెంటాడి వేటాడే తెగువ వారిది. కానీ లేహ్.. మనాలి ప్రాంతాల్లో గడ్డ కట్టే చలిలో.. మంచు కొండల మధ్య జవాన్లు కాపలా కాయడం అత్యంత క్లిష్టమైన పని. ఒక్కోసారి చలికి, మంచు చరియలు విరిగిపడి సైనికులు అమరులు కావడం విషాదం నింపుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా వేపూరికోట పంచాయతీ బంగారు వాండ్లపల్లెకి చెందిన సోల్జర్ కార్తీక్ కుమార్ రెడ్డి అమరుడయ్యాడు. ఈ వార్తతో ఊరు ఊరంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

28ఏళ్ల కార్తీక్ కుమార్ రెడ్డికి దేశమంటే విపరీతమైన అభిమానం. ఉన్నత చదువులు, ఉద్యోగాల ఆలోచన లేకుండా.. సైన్యం వైపు చూశాడు. అనుకున్నట్టుగానే సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ యంగ్‌ తరంగ్‌ హిమాచల్ ప్రదేశ్‌లోని ఉదయ్‌పూర్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గడ్డ కట్టే చలిలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో గస్తీ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో జవాన్లపై ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. సహచరులు వాటిని తొలగిస్తుండగానే మరోసారి ముంచెత్తాయి. దీంతో ఊహించని ప్రమాదం కార్తీక్ ఊపిరి ఆగిపోయేలా చేసింది.

కార్తీక్ తండ్రి నారాయణరెడ్డి ఏడాది క్రితమే చనిపోయాడు. కొద్దిరోజుల క్రితమే.. సోల్జర్‌ కార్తక్ కు వివాహమైంది. ఐదు నెలల కిందట మళ్లీ విధుల్లో చేరాడు. దీపావళి పండుగ రోజు కాల్ చేసి తల్లి సరోజమ్మ, సోదరుడు క్రాంతికుమార్‌తో మాట్లాడాడు. కానీ అంతలోనే జీర్ణించుకోలేని చేదు నిజం కుటుంబాన్ని షాక్‌కి గురిచేసింది. ఈ హఠాత్ పరిణామంతో గుండె ముక్కలు అయ్యేలా రోదిస్తోంది కోటి ఆశలతో కొత్త కాపురంలో అడుగుపెట్టిన కార్తీక్ సతీమణి

130 కోట్లమంది భారతీయులను ఒకే కుటుంబంగా భావించి.. ప్రాణాలు లెక్కచేయని ధీరత్వం, గుండె ధైర్యం ఎవరికి ఉంటాయి అతనికి తప్ప. చనిపోతే బోర్డర్‌లోనే చనిపోవాలి.. దేశం కోసమే చనిపోవాలి.. అనేంత భారతీయత ఎవరికి ఉంటుంది ఆ జవాన్‌కు తప్ప. అలా ఫిక్సయి ప్రవీణ్‌తోపాటు అమరుడయ్యాడు కార్తీక్. అమర జావాన్ మృతదేహం.. మరికాసేపట్లో స్వగ్రామానికి చేరుకోబోతోంది. ఈ సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read Also..  Kamal Haasan: నటనకు సరికొత్త అర్థం చెప్పిన కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు నేడు.. ఆయనకు సంబంధించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?