Lucky Fisherman: లక్ తిరిగింది.. సుడి కలిసింది.. చిక్కిన అరుదైన చేప.. ఖరీదు తెలిస్తే బేజారే
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద 18 కేజీల మగ కచిడి చేప జాలరి వలకు చిక్కింది.
గంగమ్మకు బాగా మొక్కి.. వల వేసినట్టున్నాడు ఆ జాలరి. అందుకే అమ్మ కరుణించి.. సిరులు కురిపించింది. అవును… అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ జాలరికి లక్ కలిసివచ్చింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో ఉప్పాడకు చెందిన మత్స్యకారుడు వల వేయగా.. 18 కేజీల మగ కచిడి చేప చిక్కింది. దీనికి వేలం పాటలో 2,90,000 రూపాయల ధర పలికింది. ఇది చాలా పెద్ద మొత్తం. దాదాపు మాములు చేపలు 5, 6 నెలలు అమ్మితే వచ్చే అమౌంట్. దీంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఇలాంటి చేపలు ఏడాదికి నాలుగు పడ్డా, జాలర్ల పంట పండినట్లే అని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
అంత రేటు ఎందుకంటే..?
ఈ కచిడి చేపను గోల్డెన్ ఫిష్‌గా అని కూడా అంటారు. విలువ ఎక్కువగా ఉండటంతో దానికి ఆ పేరు వచ్చింది. ఆపరేషన్ అనంతరం వైద్యులు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ శరీరంలో కలిసిపోతుంది. ఇక ఖరీదైన వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను యూజ్ చేస్తారు. ప్రొటోలిసియా డయాకాన్సన్ అనేది ఈ చేప సాంకేతిక నామం.
పులస లేదా కచిడి వంటి చేపలు దొరికితే రైతులకు పండగే. ఇవే అత్యధిక ధరను కలిగి ఉంటాయి. పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలంటారని మీకూ తెలిసే ఉంటుంది. ఆ చేప టేస్ట్ అలాంటిది మరి. ఇక కచిడి ఏమో మెడిసిన్ కోసం వాడతారు. మన గోదావరి తీర ప్రాంతాల్లో దొరికే చేపల్లో వీటికే ఖరీదు ఎక్కువ.
మరికొన్ని ఆంధ్రప్రదేశ్ కోసం చూడండి..